Advertisementt

మురుగదాస్‌ విజయ రహస్యం ఇదేనంట!

Mon 12th Sep 2016 02:12 PM
ar murugadoss,murugadoss success secret,mahesh babu,akira  మురుగదాస్‌ విజయ రహస్యం ఇదేనంట!
మురుగదాస్‌ విజయ రహస్యం ఇదేనంట!
Advertisement
Ads by CJ

సౌతిండియాలో మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రాలకు తన స్దాయి కమర్షియల్‌ హంగులు దిద్ది విజయాలు సొంతం చేసుకోవడంలో మురుగదాస్‌ అందరికంటే ముందుంటాడు. కాగా ఇటీవల ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ఏదైనా సినిమా చేయానుకున్నప్పుడు డైరెక్టర్‌ స్దాయిలో ఆలోంచించననీ, కేవలం ఓ ఆడియన్‌లా ఆ చిత్రం గురించి ఆ యాంగిల్‌లో ఆలోచిస్తానని తెలిపాడు. నేను ప్రేక్షకుల వ్యూ పాయింట్‌లో ఆలోచిస్తానని, అంతకు మించి తన విజయరహస్యం ఏమీ లేదని చెప్పుకొచ్చారు. అందరికీ నచ్చే, అందరూ మెచ్చే కాన్సెప్ట్‌లను నేను ఆలోచించడమే నా విజయరహస్యం అని తెలిపాడు. నేను 'అకీరా' చిత్రాన్ని చాలా తక్కువ బడ్జెట్‌లో తీశాను. ఇక మహేష్‌ సినిమాను మాత్రం భారీ బడ్జెట్‌లో తెరకెక్కిస్తున్నాను. సినిమాను బట్టి, కథ డిమాండ్‌ను బట్టి బడ్జెట్‌ ఉంటుంది. ఎక్కడ అవసరమైతే అక్కడే ఖర్చు చేస్తాను. అంతే తప్ప అనవసర ఖర్చు పెట్టడం నాకు మాత్రం ఇష్టం ఉండదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇక మహేష్‌ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తీస్తున్నాను. ప్రతి సీన్‌ను రెండు సార్లు తీయాల్సివస్తోంది. ఆర్టిస్ట్‌లు కూడా వేరువేరుగా ఉంటారు. ఇక ఈ చిత్రంలో ఎవరి పాత్రకు వారే డబ్బింగ్‌ చెప్పుకుంటారు.మహేష్‌ పాత్రకు తమిళంలో కూడా మహేషే డబ్బింగ్‌ చెప్పనున్నాడని తెలిపారు. తెలుగులో దాదాపు 9ఏళ్ల తర్వాత అంటే 'స్టాలిన్‌' చిత్రం తర్వాత నేను చేస్తున్న తెలుగు సినిమా ఇది. భవిష్యత్తులో ద్విభాషా చిత్రాలు ఎక్కువగా చేయాలని భావిస్తున్నాను. వీలుంటే తెలుగులో కూడా కొన్ని చిత్రాలను నిర్మించే ఆలోచన ఉందని అన్నారు. ఎప్పటినుంచో మహేష్‌తో సినిమా చేయాలనుకుంటున్నాను. ఆయన స్క్రీన్‌ ప్రెజెన్స్‌ చాలా బాగుంటుంది.తాజాచిత్రంలో ప్రేక్షకులు ఇప్పటివరకు ఎవ్వరూ ఊహించలేని డిఫరెంట్‌ అవతార్‌లో మహేష్ కనిపిస్తాడని తాను హామీ ఇస్తున్నట్లు తెలిపాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ