కాకినాడలో జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ చేసిన ప్రసంగం అందరినీ ఎంతగానో అలరించింది. ఆలోచన, ఆవేశం ఉన్న పవన్ నుంచి ఇంతమంచి ప్రసంగం వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కాగా ఈ సభలో పవన్ 'ఏ దేశమెగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని' అంటూ దేశభక్తి గీతం గురించి మాట్లాడిన పవన్ ఈ దేశభక్తి గీతాన్ని గురజాడ అప్పారావు రాశాడని పేర్కొన్నాడు. కానీ ఈ గీతాన్ని రచించింది రాయప్రోలు సుబ్బారావు. ఇక పవన్ మీటింగ్‌లో టిజి వెంకటేష్ గురించి స్పందించారు. తనకు ఎంపీ సీటు కావాలంటే ఎప్పుడో వచ్చేదని వ్యాఖ్యానించారు. తనకు ఎంపీ కావాలనుకుంటే ఎప్పుడో వచ్చేదని ఆయన చెప్పారు. తాను వద్దంటేనే అది టిజి వెంకటేష్‌కి లభించిందని పవన్ చెప్పకనే చెప్పారు. కాగా గతంలో రాజ్యసభ సీటు ఇవ్వనుందుకు కోపగించిన స్వర్గీయ ఎన్టీఆర్ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని స్దాపించి కాంగ్రెస్‌ను భూస్దాపితం చేశారు. ఇక తనకు మంత్రి పదవి ఇవ్వలేదన అలిగిన కేసీఆర్ టిడిపి నుండి విడిపోయి టీఆర్‌ఎస్ స్దాపించి తన సత్తా చాటుకున్నాడు. ఇప్పుడు పవన్ కూడా తనకు ఏ ఎంపీ సీటు తనకు వద్దని చెప్పి మరో సారి ప్రభంజనానికి శ్రీకారం చుడతారా? అనేది వేచిచూడాల్సివుంది. అయితే పవన్ ప్రశ్నించడం పై..ఆలోచన లేదని..ఒక్కసారి వాస్తవాలు తెలుసు కోవాలని..బీజేపీ, టీడీపీ పార్టీ నాయకులు మండి పడుతుండటంతో..ఇప్పుడు ఏపీ రాజకీయాలు కొత్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.