పవన్‌కళ్యాణ్ కాకినాడ సభలో అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ను రాజీనామా చేయమని, ఆ తర్వాత తానే అనకాపల్లి వచ్చి ఆయన్ను గెలిపించుకుంటానని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు పవన్‌పై విరుచుకుపడ్డారు. తమ బావ అల్లు అరవింద్‌నే చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌లు గెలిపించుకోలేకపోయారు. మరి ఎంపీలను గెలిపించే సత్తా ఉంటే అల్లు అరవింద్‌ను ఇద్దరు ఎందుకు గెలిపించుకోలేకపోయారు. మరి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసి ఎన్నికల్లో నిలబెడితే పవన్ ఒక్కడే ఎలా గెలిపించగలడని ఎద్దేవా చేశారు. మరి పవన్‌కళ్యాణ్‌కు ఎంపీలను గెలిపించుకునే సత్తా లేకపోతే ఎన్నికల ముందు తెలుగుదేశం ఎంపీలు, ఎమ్మెల్యేలు, చివరకు చంద్రబాబునాయుడు కూడా పవన్ మద్దతు కోసం అంతగా ఎందుకు వెంపర్లాడారని పవన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఒక పక్క పవన్‌ను ఏమీ అనవద్దని, ఆయనపై నోరు పారేసుకోవద్దని హెచ్చరిస్తున్న చంద్రబాబు.. ఇలాంటి కామెంట్లను స్వయంగా తమ మంత్రులే చేస్తుంటే దీన్ని ఏమనాలి? చంద్రబాబు యూజ్ అండ్ త్రో విధానానికి ఇది మరో ఉదాహరణ అని చెప్పాలేమో మరి....!