ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కిన 'జనతా గ్యారేజ్' గత వారం విడుదలై టాక్ తో సంబంధం లేకుండా థియేటర్లలో దూసుకుపోతుంది. ఈ సినిమా ఇంత కలెక్ట్ చేసింది అంత కలెక్ట్ చేసిందని రోజుకో న్యూస్ వార్తల్లోకెక్కుతుంది. ఇక ఇది తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా కలెక్షన్స్ పరం గా దూసుకుపోతుంది. ఈ సినిమా రోజురోజుకు సరోకొత్త రికార్డు ని నెలకొల్పుతుందని అంటున్నారు. 'బాహుబలి' చిత్రం తర్వాత మొదటి వారం లో 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రం గా జనతా గ్యారేజ్ రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే కాకుండా మాస్ అభిమానులకు మెచ్చేలా ఉందని అందుకే కలెక్షన్స్ ఏమాత్రం డ్రాప్ అవ్వలేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే 'జనతా గ్యారేజ్' సినిమాని టాలీవుడ్ సీనియర్ హీరో ఒకరు ప్రత్యేకించి వీక్షించారని .... సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్, మోహన్ లాల్ నటనని విపరీతంగా పొగుడుతున్నారని సమాచారం. ఆ సీనియర్ హీరో ఎవరో కాదు విక్టరీ వెంకటేష్. ఆయన ఈ మధ్య 'జనతా గ్యారేజ్' ని స్పెషల్ గా తిలకించారని చెబుతున్నారు. సినిమా చూసాక అయన సోషల్ మీడియాలో 'జనతా గ్యారేజ్' ఒక ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అని... ఎన్టీఆర్, మోహన్ లాల్ నటన సూపర్బ్ అని... ఇందులో నటించిన, ఇంకా పని చేసిన వారందరికీ కంగ్రాట్స్ అని పోస్ట్ చేసాడట. వెంకటేష్ ఇలా 'జనతా గ్యారేజ్' కి విషెస్ తెలియజెయ్యడం మాత్రం పెద్ద విశేషమే.