Advertisementt

గెలిపిస్తే హోదా తెస్తాడంట..!

Sat 10th Sep 2016 11:38 PM
special status,ys jagan,pawan kalyan,tdp,andhra pradesh  గెలిపిస్తే హోదా తెస్తాడంట..!
గెలిపిస్తే హోదా తెస్తాడంట..!
Advertisement
Ads by CJ

ప్రత్యేక హోదా విషయం ఏపీలో రోజురోజుకి ముదిరి పాకాన పడుతుంది. ఈ రోజు (శనివారం) ప్రత్యేక హోదా రానందుకు ఏపీ వ్యాప్తం గా బందులు, ఆందోళనలు, నిరసనలు తెలియజేస్తూ ప్రజలు రోడ్డెక్కారు. ఇలాంటి సమయం లో పవన్ కాకినాడ సభను నిన్న(శుక్రవారం) సాయంత్రం విజయవంతం గా పూర్తి చేసాడు. కాకినాడలో ఆత్మగౌరవ సభలో పవన్ మాట్లాడుతూ..  నేను బందులు, ఆందోళనలకు వ్యతిరేకమని, ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని.... విద్యార్థులు చదువులు మానేసి ఇలా కష్టపడొద్దని హెచ్చరించాడు.  ఏపీ ప్రత్యేక హోదా విషయం లో నేతలకు చేతకాక పొతే జనసేనే ఆ విషయం చూసుకుంటుందని నేతలనుద్దేశించి ఘాటుగా స్పందించాడు. ఇక ప్రతిపక్ష నాయకుడు జగన్ అయితే ప్రత్యేక హోదా విషయంలో  మనం తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ ని ఆదర్శం గా తీసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంటే ఆయనని ఏవిధంగా ఆదర్శం గా తీసుకోవాలంటే... తెలంగాణా రాష్ట్రం ఎప్పటికి రాదనుకున్న తరుణం లో ఆయన నిరాహార దీక్ష మరియు బందులు, ఆందోళనలతోనే తెలంగాణాని సాధించారని అన్నారు. 10 సంవత్సరాలు ఎడతెరిపి లేని పోరాటం చేశారని.... ఈ విషయం లో తెలంగాణలోని ప్రతి ఒక్కరు కేసీఆర్ కి సహకరించారని గుర్తు చేశారు. ఇక ఆయనలాగే మనం కూడా బందులు, నిరాహార దీక్షలు చేపట్టి కేంద్రానికి ఊపిరాడకుండా చేసి ప్రత్యేక హోదా సాధించుకోవాలని వైసిపి నేతలకు, ఏపీ ప్రజలకు  పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధన ఒక్క జగన్ తోనే సాధ్యం కాదని ఏపీ ప్రజలు ప్రతి ఒక్కరూ జగన్ కి తోడు, నీడ లా నిలవాలని అయన వేడుకున్నారు. 2019 లో నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా కోసం పోరాడి హోదాని తీసుకొచ్చి మీ చేతుల్లో పెడాతాని చెప్పుకొచ్చాడు. మరి పాపం ఇంత తెలివున్న చంద్రబాబు వల్ల కానీ ప్రత్యేక హోదా పని కేవలం ఒక్క జగన్ తో సాధ్యపడుతుందని ఎవరన్నా నమ్ముతారా...!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ