Advertisementt

బాబు హెచ్చరిక: పవన్‌ పై విమర్శలొద్దు..!

Sat 10th Sep 2016 07:02 PM
pawan kalyan,chandrababu naidu,special status,tg venkatesh,avanthi srinivas,kakinada  బాబు హెచ్చరిక: పవన్‌ పై విమర్శలొద్దు..!
బాబు హెచ్చరిక: పవన్‌ పై విమర్శలొద్దు..!
Advertisement
Ads by CJ

కాకినాడ సభలో పవన్‌ బిజెపి, టిడిపిలతో పాటు అందరినీ కడిగిపారేశాడు. దీంతో కొందరు తెలుగుదేశం నేతలు పవన్‌ వ్యాఖ్యలను తిప్పికొట్టాలని భావించారు. పవన్ కు కౌంటర్‌ ఇవ్వకపోతే తమ తప్పు ఒపుకున్నట్లు అవుతుందని టిడిపి నాయకులు భావిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం వపన్‌ వ్యాఖ్యలపై స్పందించడం, ఆయన్ను మరింత రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయవద్దని తన పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని సమాచారం. టిజి వెంకటేష్‌, అవంతి శ్రీనివాస్‌ వంటి వారికి పవన్‌ ప్రసంగం తీవ్రక్షోభకు గురి చేసిందని అంటున్నారు. అయినా పవన్‌కు వ్యతిరేకంగా కౌంటర్లు ఇస్తే అది తమకే చేటు చేస్తుందని, పవన్‌ను తన మానానా తనని వదిలేసి, తమ పనిచేసుకుంటూ పోవాలనేది బాబు వ్యూహంగా కనిపిస్తుంది. మొత్తానికి పవన్‌ ప్రసంగం రాష్ట్రాన్నే కాదు.. దేశ రాజధానిలో కూడా ప్రకంపనలు సృష్టిస్తూ అగ్రపార్టీ నాయకుల్లో గుబులురేపుతోంది. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ