'సైజ్ జీరో' పుణ్యమా అని విపరీతంగా బరువు పెరిగిన అనుష్క ఆ తర్వాత మరలా తన ఒరిజినల్ షేప్ కోసం నానాతిప్పలు పడుతోంది. దీంతో కుర్ర దేవసేనగా అమరేంద్ర బాహుబలితో కలిసి అనుష్క చేయాల్సిన శృంగార సన్నివేశాలు, పాటల చిత్రీకరణను పక్కన పెట్టిన రాజమౌళి నిన్నటివరకు ఈ చిత్రం క్లైమాక్స్‌లో వచ్చే వార్‌సీన్లు తీస్తూ గడిపాడు. ఎలాగోలా అనుష్క తన పూర్వపు పర్సనాలిటీకి వచ్చి ఇప్పుడు జక్కన్న చేత ఓకే అనిపించుకుంది. దీంతో ప్రస్తుతం అనుష్క, ప్రభాస్‌ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్‌ను, పాటలను తెరకెక్కించే పనిలో రాజమౌళి దృష్టి పెట్టాడు. ప్రస్తుతం ఆ తరహా సీన్స్‌ను చిత్రీకరించడంలో జక్కన్న నిమగ్నమై ఉన్నాడు. ఎలాగైనా తన యోగా టిప్స్ అన్ని వాడుకొని దేవసేన పూర్వపు షేప్‌లను పొందడం ఇప్పుడు ఆమె అభిమానులకు తీపి కబురే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ చివరదశకు వచ్చింది. ఈ షూటింగ్‌ను కూడా త్వరగా పూర్తి చేసి పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలతో పాటు అత్యంత కీలకమైన గ్రాఫిక్స్ పనుల్లో జక్కన్న బిజీ కానున్నాడు. కాగా ఈ చిత్రం 2017 ఏప్రిల్ 28న రిలీజ్‌ను ఖాయం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం 'బాహుబలి- ది కన్‌క్లూజన్' చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ జోరందుకుంది. పలు ఏరియాలను బయ్యర్లు భారీ రేటుకు కొనుక్కుంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించి బిజినెస్ పూర్తయ్యినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.