తన సినిమాల ద్వారా మంచి సందేశాలను ఇస్తూ, దానికి తగ్గట్లుగా కమర్షియల్ హంగులు కూడా అద్దడంలో దర్శక రచయిత కొరటాల శివ చేసే చిత్రాలు అందరి మన్ననలు పొందుతున్నాయి. 'మిర్చి'లో ఎదుటి వారిని ప్రేమించడం, 'శ్రీమంతుడు'లో గ్రామాల దత్తత, తాజాగా 'జనతాగ్యారేజ్'తో పర్యావరణాన్ని, పక్కవారిని ప్రేమించండి అనే సందేశాలను అందించిన కొరటాల శివ ఈ చిత్రం తర్వాత దానయ్య నిర్మాతగా మహేష్‌బాబుతో మరో చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా మహేష్ చిత్రం ద్వారా ఆయన ఏమి సందేశం ఇస్తాడో అని అందరూ ఎదురుచూస్తున్నారు. కాగా ఈ చిత్రంలో కూడా మంచి సోషల్ మెసేజ్ ఇవ్వనున్నానని కొరటాల కూడా క్లారిటీ ఇచ్చాడు. తాజా సమాచారం ప్రకారం ఈ తాజా చిత్రంలో 'మనలను మనం ప్రేమించుకోవడం ఎలా?' అనే సందేశాన్ని ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. నేటిరోజుల్లో వివిధ రకాలైన టెన్షన్ల కారణంగా తమను తాము ప్రేమించుకోవడం, ఎదుటివారిని ప్రేమించడం ఎంత ముఖ్యమో కొరటాల శివ తెరపై ఆవిష్కరించనున్నట్లు, లైఫ్‌ని ఎలా గడపాలో ఈ చిత్రం ద్వారా కొరటాల ప్రేక్షకులకు మేసేజ్ ఇవ్వనున్నాడని ప్రచారం జరుగుతోంది.