Advertisementt

'ఎన్టీఆర్‌' క్రేజ్ ని వాడుకుంటారంట!

Fri 09th Sep 2016 05:13 PM
ntr,ism,jr ntr,puri jagannadh,kalyan ram,ntr in ism movie  'ఎన్టీఆర్‌' క్రేజ్ ని వాడుకుంటారంట!
'ఎన్టీఆర్‌' క్రేజ్ ని వాడుకుంటారంట!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం 'జనతాగ్యారేజ్‌' చిత్రం సృష్టిస్తున్న కలెక్షన్ల సునామీతో ఎన్టీఆర్‌ మహదానందంగా ఉన్నాడు. ఎన్నో ప్రతికూల పరిస్దితులను ఎదుర్కొని కూడా ఈ చిత్రం అదిరిపోయే కలెక్షన్లతో బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టిస్తోంది. 'బాహుబలి' తర్వాత అతి తక్కువ సమయంలో 100 కోట్లు వసూలు చేసిన చిత్రంగా 'జనతాగ్యారేజ్‌' నిలిచింది. ఈ ఒక్క సినిమాతో ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్‌ రెండింతలు పెరిగిందంటే అతిశయోక్తికాదు. దీంతో ఇంతకాలం కేవలం తన తమ్ముడు ఎన్టీఆర్‌తో నిర్మాతగా ఓ చిత్రం చేయాలని భావిస్తున్న ఆయన అన్నయ్య నందమూరి కళ్యాణ్‌రామ్‌ ఇప్పుడు పూరీతో కలిసి ఎన్టీఆర్‌ క్రేజ్‌ను వాడుకోవాలని డిసైడ్‌ అయ్యారని సమాచారం. నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా, నిర్మాతగా ప్రస్తుతం పూరీజగన్నాథ్‌తో కలిసి 'ఇజం' చిత్రం చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పోస్టర్స్‌, టీజర్స్‌ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ చిత్రంలో తన తమ్ముడు ఎన్టీఆర్‌ను ఓ గెస్ట్‌రోల్‌ చేయించాలని కళ్యాణ్‌రామ్‌తో పాటు పూరీ జగన్నాథ్‌ కూడా ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ చిత్రంలో తన తమ్ముడు కూడా కనిపిస్తే ఇప్పుడు ఆయనకున్న ఇమేజ్‌ చిత్రం మైలేజ్‌కి బాగా కలిసొస్తుందని కళ్యాణ్‌రామ్‌, పూరీలు భావిస్తున్నారు. మరి వీరి మాటలను ఎన్టీఆర్‌ ఒప్పుకుంటాడో లేదో వేచిచూడాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ