Advertisementt

ఇదంతా 'ధృవ' కోసమేనా !

Fri 09th Sep 2016 03:24 PM
ram charan,special show,allu aravind,dhruva  ఇదంతా 'ధృవ' కోసమేనా !
ఇదంతా 'ధృవ' కోసమేనా !
Advertisement
Ads by CJ

ప్రస్తుతం రామ్‌చరణ్‌ గీతాఆర్ట్స్‌ పతాకంపై అల్లుఅరవింద్‌ నిర్మాతగా సురేందర్‌రెడ్డి దర్వకత్వంలో 'ధృవ' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ ఓ యువ ఐపిఎస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఈ పోలీస్‌ పాత్ర మేకోవర్‌ కోసం చరణ్‌ పలువురు ఐపిఎస్‌ అధికారులను కలిసి వారి నుండి తన గెటప్‌తో పాటు బాడీ లాంగ్వేజ్‌ విషయంలో కూడా సలహాలు తీసుకొని దానికి తగ్గట్లుగా తనను తాను మేకోవర్‌ చేసుకున్నాడు. కాగా దసరాకి విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల డిసెంబర్‌లో విడుదల కానుంది. కాగా ఈచిత్రం కోసం అల్లుఅరవింద్‌ కొత్త తరహా ప్రమోషన్‌కు శ్రీకారం చుట్టనున్నాడట. ఇక తన పాత్ర కోసం ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చిన పోలీస్‌ ఆఫీసర్ల కోసం, వివిధ జిల్లాల ఎస్పీలకు కూడా ఈ చిత్రాన్ని ఓ ప్రత్యేక షో వేయాలని రామ్‌చరణ్‌ భావిస్తున్నాడు. మొత్తానికి తనకు సహాయపడిన వారికి ఈ విధంగా స్పెషల్‌ షో వేయడానికి చరణ్‌ ప్లాన్‌ చేయడం కూడా ప్రమోషన్‌లో ఓ భాగంగా అరవింద్‌ భావిస్తున్నాడని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ