Advertisementt

'ఖైదీ నెంబర్ 150' రికార్డ్స్ మొదలయ్యాయ్!

Fri 09th Sep 2016 03:10 PM
khaidi number 150,khaidi number 150 overseas records record,record price to khaidi number 150,chiranjeevi  'ఖైదీ నెంబర్ 150' రికార్డ్స్ మొదలయ్యాయ్!
'ఖైదీ నెంబర్ 150' రికార్డ్స్ మొదలయ్యాయ్!
Advertisement
Ads by CJ

చిరంజీవి, వి.వి వినాయక్ కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'ఖైదీ నెంబర్ 150'. చిరంజీవి 150వ సినిమాగా 'ఖైదీ నెంబర్ 150' తాలూకూ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా చాలా కాలం తర్వాత చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రం కోసం అటు పరిశ్రమ ఇటు అభిమానులు ఎంతో కుతూహలంతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి అప్పుడే బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతుంది. ఖైదీ నెంబర్ 150 సినిమా ఓవర్సీస్ రైట్స్ 13.5 కోట్లకు అమ్ముడు పోయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీన్ని బట్టి చిరంజీవి 150వ సినిమా ఎన్నో రికార్డులను అధిగమించనుందని తెలుస్తుంది. 

గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ ఓవర్సీస్ రైట్స్ 10 కోట్లు పలికితే, బ్రహ్మోత్సవం 13 కోట్లు, జనతా గ్యారేజ్ 7.5 కోట్లకు అమ్ముడు పోయాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చిత్రం 13.5 కోట్లకు ఓవర్సీస్  రైట్స్ అమ్ముడయ్యాయి. దీంతో అన్ని రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డును దక్కించుకొన్నది ఈ చిత్రం. కాగా మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రమైన ఖైదీ నెంబర్ 150 వచ్చే సంవత్సరం సంక్రాతి పండుగకి విడుదల కానుంది.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ