Advertisementt

లారెన్స్‌..ద రియల్‌ హీరో!

Thu 08th Sep 2016 08:43 PM
raghava lawrence,heart operations,abhinesh,lawrence social service  లారెన్స్‌..ద రియల్‌ హీరో!
లారెన్స్‌..ద రియల్‌ హీరో!
Advertisement
Ads by CJ

నటునిగా, కొరియోగ్రాఫర్‌గా, దర్శకునిగా ఇలా ఆల్‌రౌండర్‌ అనిపించుకునే లారెన్స్‌ నిజజీవితంలో కూడా అందరిచేత సెహభాష్‌ అనిపించుకుంటున్నాడు. తాజాగా ఆయన గుండె జబ్బుతో బాధపడుతున్న అభినేష్‌ అనే పిల్లాడికి గుండె శస్త్రచికిత్సకు అయ్యే మొత్తం ఖర్చును తానే భరిస్తానని మాట ఇచ్చి నిలబెట్టుకున్నాడు. సినిమాకి కోట్ల కోట్లు తీసుకునే వారు కూడా ఏదైనా ఉపద్రవాలు వస్తే ఏదో ఎంతో కొంత విరాళం అందించడం గొప్పకాదు. యేడాదికి కేవలం రూ.7కోట్లు నికర ఆదాయం కూడా లేని లారెన్స్‌ ఏటా తన సేవాకార్యక్రమాలకు రెండున్నర నుంచి మూడు కోట్లు ఖర్చుచేస్తున్నాడని తెలిస్తే ఎవరైనా హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే. ఇప్పటివరకు ఆయన 130మందికి పైగా గుండె శస్త్రచికిత్సలు చేయించాడు. ఇక అనాధల కోసం, వికలాంగుల కోసం ఆయన ఆశ్రమాలు నడుపుతున్నాడు. ఎందరో అభాగ్యులకు సాయం చేస్తున్నాడు. ఏడాదికి ఇందుకోసం రెండు కోట్లు నుంచి మూడు కోట్లు ఖర్చు చేస్తున్నాడు. కానీ పబ్లిసిటీకి దూరంగా ఆయన చేస్తున్న ఈ మంచి కార్యక్రమాల గురించి వింటున్నవారు మాత్రం హ్యాట్సాఫ్‌ లారెన్స్‌ అంటున్నారు. రియల్లీ హి ఈజ్‌ ద రియల్‌ హీరో అని చెప్పవచ్చు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ