Advertisementt

ఎన్టీఆర్ కు భద్రత కల్పించలేమన్న పోలీసులు..!

Thu 08th Sep 2016 03:55 PM
janatha garage,jr ntr,visakha police,success celebrations,disappoint  ఎన్టీఆర్ కు భద్రత కల్పించలేమన్న పోలీసులు..!
ఎన్టీఆర్ కు భద్రత కల్పించలేమన్న పోలీసులు..!
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్' సినిమా బాక్సీఫీస్ వద్ద సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు మొదట్లో మిశ్రమ ఫలితాలు వచ్చినప్పటికీ వసూళ్ళు ఏమాత్రం తగ్గలేదు. వసూళ్ళు రాబట్టడంలో అనుకున్న దానికంటే అద్భుతంగా రాబట్టిందనే చెప్పాలి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విశాఖ పట్టణంలో ఈనెల 10వ తేదీన 'జనతా గ్యారేజ్' విజయోత్సవ సభ నిర్వహించాలని అనుకున్నాడు. కానీ ఎన్టీఆర్ సభకు అనుమతి లభించలేదు. 'జ‌న‌తా గ్యారేజ్‌' ఘన విజయం సాధించడంతో ఎన్టీఆర్ మిక్కిలి పొంగిపోతున్న విషయం తెలిసిదే. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఈ సినిమా అత్య‌ధిక వ‌సూళ్లు సాధించే అవకాశం కూడా ఉంది. వసూళ్ళ వర్షాన్ని చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 10వ తేదీన 'జనతా గ్యారేజ్' చిత్రం విజయోత్సవ సభ జరపాలని ఎన్టీఆర్ భావించాడు. అనుకున్నదే తడవుగా చిత్ర‌ బృందం అనుమతుల కోసం ఏపీ ప్ర‌భుత్వాన్ని కూడా సంప్ర‌దించింది. కానీ విశాఖ పోలీసులు మాత్రం గ‌ణేష్ నిమ‌జ్జ‌నాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ కు భద్రత కల్పించలేమని చేతులెత్తేశారు. ఈ ఘటనతో కంగుతిన్న ఎన్టీఆర్ ఈ  విజ‌యోత్స‌వ సభను విశాఖలో రద్దు చేసుకోవడం జరిగింది. ఎన్టీఆర్ విజయోత్సవ సభను లేటుగా అయినా విశాఖలో జరుపుతారా? లేక హైద‌రాబాద్‌లో నిర్వ‌హిస్తారా?  అనేది వేచి చూడాలి.   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ