పవన్ కళ్యాణ్ తిరుపతి బహిరంగ సభలో నేను డబ్బులు కోసమే సినిమాలు చేస్తున్నాని చెప్పాడు. అటు రాజకీయాలను, ఇటు సినిమాలను రెండింటిని వదిలిపెట్టనని చెప్పాడు. ఇక పొలిటికల్ గా యాక్టీవ్ అయిన పవన్ సినిమాల్లోనూ అదే స్పీడు కంటిన్యూ చేస్తున్నాడు. శరత్ మరార్ నిర్మాణం లో డాలీ డైరెక్షన్ లో చేసే 'కాటమరాయుడు' సినిమా లో తనకు సంబందించిన సన్నివేశాలను 50 రోజుల్లో పూర్తి చెయ్యాలని పవన్ కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ దాసరి ప్రొడ్యూసరుగా సినిమా చెయ్యడానికి కూడా రెడీ అయ్యాడని సమాచారం. ఈ సినిమా ఇప్పటివరకు ఎప్పుడు మొదలవుతుందనేది ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఇక దీనికి డైరెక్టర్ గా ముందు త్రివిక్రమ్ పని చేస్తాడు అని అనుకున్నారు. కానీ త్రివిక్రమ్ డైరెక్ట్ చేసే పవన్ చిత్రానికి ఎస్. రాధాకృష్ణ నిర్మాత అని పవన్ బర్త్ డే రోజు పోస్టర్స్ చెప్పేశాయి . అయితే ఇప్పుడు దాసరి సినిమాని బోయపాటి శీను తెరకెక్కిస్తాడని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే బోయపాటి మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టి అల్లు అర్జున్ కి 'సరైనోడు'తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు పవన్ తో సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇంకేముంది మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా పేరున్న బోయపాటి డైరెక్షన్ లో పవన్ సినిమా అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి...! మరి అలా పవన్ ని మాస్ యాంగిల్ లో చూపిస్తాడా లేక రాజకీయాలకు పనికొచ్చేటట్టు ఏమైనా మెస్సేజ్ ఇచ్చే సినిమాని తీస్తాడా అని అప్పుడే తెగ చర్చించేసుకుంటున్నారు పవన్ అభిమానులు. అసలు ఈ ఆలోచనలు వీరికి ఎందుకొచ్చాయంటే బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన 'సింహా, లెజెండ్' వంటి సినిమాలు బాలకృష్ణ కి రాజకీయాల్లోకి రావడానికి బాగా ఉపయోగపడిన సంగతి తెలిసిందే. ఇక బాలయ్య ఎమ్యెల్యే గా పోటీ చేసి ఎమ్యెల్యే అయిపోయినట్లు.... పవన్ ని కూడా అలా మాస్ కమ్ పొలిటికల్ యాంగిల్ లో చూపిస్తాడేమో బోయపాటి. అందుకే పవన్ కూడా బోయపాటి డైరెక్షన్ లో చెయ్యడానికి మొగ్గు చూపుతున్నాడనేది ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినబడుతున్న మాట.