టాలీవుడ్ లో ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ సినిమా కి ఇక్కడ తెలుగు రాష్ట్రాలలోనే కాక ఓవర్సీస్ లో కూడా పండగ వాతావరణం నెలకొంటుంది. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఓవర్సీస్ ని కబ్జా చేసేసారు అనేది సత్యం. అందుకే టాలీవుడ్ సినిమాలు ఓవర్సీస్ కి కూడా ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇక సినిమా హిట్ అయ్యింది అంటే అందులో నటించిన హీరో గారు ఓవర్సీస్ లో కూడా మంచి పేరు కొట్టేస్తున్నాడు. ఇక ఇక్కడ ఎన్ని కోట్లు కొల్లగొట్టింది అని లెక్కలేసే నిర్మాతలు ఓవర్సీస్ లో కూడా అదే లెక్కలు వేసేస్తున్నారు. అయితే ప్రధానం గా ఒక్క హీరోనే ఓవర్సీస్ లో పేరు కొట్టేస్తున్నారు. అయితే మా హీరో సినిమాలు ఇన్ని హిట్ అయ్యాయి అన్నిహిట్ అయ్యాయి అని అభిమానులు తెగ డబ్భా కొట్టేస్తున్నారు. అంతే కానీ ఒక డైరెక్టర్ గురించి గాని ఒక హీరోయిన్ గురించిగాని ఎక్కడా ప్రస్తావన తీసుకురావడం లేదు. ఇక ఇప్పుడు మహేష్ ఓవర్సీస్ లో 6 సినిమాలు హిట్ అయ్యి నెంబర్ 1 గా కొనసాగుతుంటే ఎన్టీఆర్ 4 సినిమాలతో రెండో ప్లేస్ లో వున్నాడు. ఇక మూడో ప్లేస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వున్నాడు. అలా హీరోలని కాకుండా హీరోయిన్స్ ని గనక లెక్కలోకి తీసుకుంటే అందరికన్నా ముందు సమంత టాప్ ప్లేస్ లో ఉందట. అందరికన్నా అంటే హీరోలకన్నా ముందు అన్నమాట. మన హీరోలు కేవలం 6, 4, 3 సినిమాలతో ఉంటే సమంత ఏకం గా 11 సినిమాలతో టాప్ ప్లేస్ కొట్టేసి టాలీవుడ్ హీరోలకు బంపర్ షాక్ ఇచ్చిందట. సమంత నటించిన 11 సినిమాలు ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ల కలెక్షన్ సాధించి సూపర్ రికార్డు ని సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక సమంత ఓవర్సీస్ లో రికార్డు సాధించిన 11 సినిమాలు ఇవే ఒకసారి లూక్కేయండి.
1. అత్తారింటికిదారేది
2. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు
3. దూకుడు
4. మనం
5. ఈగ
6. సన్ ఆఫ్ సత్యమూర్తి
7. 24
8. అ.. ఆ
9. బ్రహ్మోత్సవం
10. జనతా గ్యారేజ్
11. తమిళ తేరి