Advertisementt

వెంకీ ఒక్కడే మిస్‌ అవుతున్నాడు..!

Wed 07th Sep 2016 07:36 PM
venkatesh,nagarjuna,balakrishna,chiranjeevi,sankranthi,om namo venkatesaya,khaidi no 150,gautamiputra satakarni  వెంకీ ఒక్కడే మిస్‌ అవుతున్నాడు..!
వెంకీ ఒక్కడే మిస్‌ అవుతున్నాడు..!
Advertisement
Ads by CJ

మన సీనియర్‌ స్టార్స్‌ అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లలో ముగ్గురు సీనియర్‌స్టార్స్‌ అయిన చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెం150', బాలయ్య నటిస్తోన్న 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణిలతో పాటు నాగార్జున హీరోగా రూపొందుతున్న భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' ఈ మూడు చిత్రాలు రాబోయే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కావడం ఖరారైపోయింది. మన సీనియర్‌ స్టార్స్‌ ఇలా పోటీపడి చాలాకాలం అయింది. మరోసారి వీరిలో వెంకటేష్‌ మినహా మిగిలిన స్టార్స్‌ ముగ్గురి రాక దాదాపు ఖాయమైపోయింది. ఇటీవలి కాలంలో 'మనం, సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి' వంటి అద్భుతాలు చేస్తూ, తన ఫామ్‌ను కొనసాగిస్తున్న నాగ్‌ వచ్చే సంక్రాంతికి వెంకటేశ్వరస్వామి ప్రియభక్తుడైన హతీరాం బాబా జీవిత చరిత్ర ఆధారంగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మితమవుతున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి వచ్చే సంక్రాంతిని మన యువ స్టార్స్‌ అందరూ తమ సీనియర్స్‌కు స్దానం వచ్చి తాము మాత్రం వేసవిలో రావాలని భావిస్తున్నారు. మరి బాక్సాఫీస్‌ వద్ద ఈ ముగ్గురు స్టార్స్‌ ఎలాంటి సంచలనం సృష్టిస్తారో వేచిచూడాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ