మాజీ భారత ప్రధాని అటల్ బీహారీ వాజపేయికి అరుదైన రికార్డు దక్కింది. విజయవంతంగా భారతావనిని పాలించిన ప్రధానులలో వాజపేయి చేరుకున్నారు. అవినీతి మచ్చ అంటకుండా దాదాపు ఆరేళ్ళపాటు భారత్ కు ప్రధానిగా చేసి అద్భుతమైన సేవలందించారు. ‘భారతీయుడు’, మాజీ ప్రధాని, గొప్ప నాయకుడయిన వాజపేయి అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు తాజాగా మాజీ ప్రధానులయిన ఇందిరాగాంధీ, నెహ్రూలను కూడా అధిగమించాడు. అది ఎలాగంటే... జీవించి ఉండగానే అత్యధిక ప్రభుత్వ పథకాలకు పేరున్న నాయకుడిగా రికార్డ్ సృష్టించాడు. అంతటి ఘనత ఇప్పటికి వాజపేయికే దక్కడం ఎంతటి అదృష్టం.
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం అత్యధిక సంఖ్యలో పథకాలకు వాజపేయి పేరు పెట్టింది. మోడీ ప్రభుత్వం అధికారికంగా అమలులో ఉన్న అనేక పథకాలకు అటల్ అన్న పేరును చేర్చింది. రాజస్థాన్ రాష్ట్రంలోనైతే ప్రభుత్వం దాదాపు 9,000 గ్రామ పంచాయితీలకు అయన పేరుని చేర్చింది. భారత రాజకీయాలలో నిస్వార్ధ సేవ చేసిన గొప్ప సంఘ సంస్కర్తలా, అద్భుతమైన జాతీయ నాయకుడుగా తనదైన ముద్రవేసిన వాజ్ పేయి గత చాలా కాలం నుండి అనారోగ్యంతో భాదపడుతున్న విషయం తెలిసిందే. ఇంకో గొప్ప విషయం ఏంటంటే భారత ప్రభుత్వం వాజపేయి పుట్టిన రోజు అయిన డిసెంబర్ 25ను సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించింది. ఇంతకంటే గొప్ప గౌరవం మరొకటి ఏముంటుంది.