భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంటికి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ వచ్చాడు. అదీ వినాయక చవితి రోజు రావడంతో సచిన్ ఇంట్లో డబుల్ పండుగ వాతావరణం వెల్లివిరిసింది. వినాయక చవితి సందర్భంగా సచిన్ ఇంటికి జాంటీ రోడ్స్ వచ్చి ప్రత్యేకంగా వినాయకునిపై తనకున్న అమిత ఆరాధనా భావాన్ని చూపించాడు. కాగా సచిన్, జాంటీరోడ్స్ కలిసి వినాయకుడి పూజ చేస్తున్నఫోటోను సచిన్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఇంకా ఆ ఫోటోతో పాటు మొదట ఈ వినాయకునికి పూజ చేస్తున్న ఈ అతిథి ఎవరో చెప్పుకోండి చూద్దాం అని అభిమానులనుప్రశ్నించాడు సచిన్... దీంతో ఆలోచనలతో కిందా మీద పడుతున్న అభిమానులు రికీపాంటింగ్ అని, రోజర్ ఫెదరర్ అని సమాధానాలు చెప్పడం మొదలు పెట్టారు. అయితే ఈ విషయంలో అభిమానులను విసిగించడం ఇష్టం లేని సచిన్ ఆ అతిథి ఎవరనేది చెప్పేశాడు. అతనెవరో కాదు.. మన భారతీయ సంప్రదాయాలను అమితంగా ఇష్టపడే సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీరోడ్స్ అని చెప్పేశాడు.
భారతీయ సంప్రదాయాలన్నా సంస్కృతి అన్నా ఎనలేని గౌరవాన్ని చూపే జాంటీరోడ్స్ తన కూతురికి ఇండియా అని పేరుపెట్టుకున్నాడు. కాగా తన ఇంటికి జాంటీ రోడ్స్ గణపతి ఆశీస్సులు పొందేందుకు వచ్చాడని సచిన్ వెల్లడించాడు. ఒక్క జాంటీరోడ్సే కాకుండా వినాయక చవితి సందర్భంగా సచిన్ ఇంటికి యువరాజ్ సింగ్ కూడా అతిధిగా వెళ్ళాడు. సచిన్ ఆనందంతో.. వీరికి తగిన ఆతిథ్యాన్ని అందించాడు.