తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించింది. కవిత ఓ చానల్ లో మాట్లాడుతుండగా, జాగృతి అనేది ఓ స్వచ్ఛంద సంస్థ కదా దాన్ని మీరు రాజకీయాలకు ఉపయోగించుకోవడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నకు కవిత చాలా తెలివిగా సమాధానం చెప్పింది.
తెలంగాణ జాగృతి అనే స్వచ్ఛంద సంస్ధకు రాజకీయాలు అనే బురద అంటకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నానని వెల్లడించింది కవిత.ఇంకా తాను మాట్లాడుతూ జాగృతికి, రాజకీయాలకు అస్సలు సంబంధమే లేదని, అందుకనే జాగృతి లోగోలో కూడా కేసీఆర్ గారి ఫోటో లేకుండా జాగ్రత్త పడుతున్నామని వివరించింది. తాను ఏ పని చేసినా స్వతంత్రంగా, స్వచ్ఛందంగా చేయాలన్న సంకల్పంతోనే ఈ సంస్థను ప్రారంభించానని వెల్లడించిది. ఈ జాగృతి అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా గ్రామాల్లోని యువతకు, నిరుద్యోగులకు శిక్షణ ఇప్పించి ఆ రకంగా ఉపాది అవకాశాలు అందిస్తున్నామని తెలిపింది.
ఇంకా కవిత మాట్లాడుతూ... లోకసత్తా ఓ ఉద్యమంలా వచ్చి అలా చల్లారిపోయింది. లోక్ సత్తా లో కొన్ని ఆదర్శాలు అందరినీ ఆకర్షించేలా ఉన్నవి. ఓ రకంగా చెప్పాలంటే తానూ లోకసత్తాలోని ఆదర్శవంతమైన భావాలకు ఆకర్షితురాలైనట్లు వెల్లడించింది. కానీ లోక్ సత్తా ను జయప్రకాష్ నారాయణ రాజకీయ పార్టీగా మార్చడం అన్నది తనను చాలా బాధించిన అంశంగా చెప్పింది కవిత. అయితే లోక్ సత్తా లా జాగృతి మారదని కూడా కవిత తెలిపింది.