అల్లు అర్జున్, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన 'సరైనోడు' భారీ అంచనాల మధ్య విడుదలై మొదటి షో కే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా ప్లాప్ గురించి వెబ్ సైట్స్ కూడా తెగ ప్రచారం చేసేశాయి. రివ్యూస్ కూడా అనుకున్నంత పాజిటివ్ గా రాని 'సరైనోడు' సినిమా.. కలెక్షన్స్ పరం గా దుమ్ము దులిపేసింది. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీలోనే అతి పెద్ద హిట్ గా నిలిచి అందరి నోళ్లు మూయించింది. ఇప్పుడు 'జనతా గ్యారేజ్' విషయం లో కూడా అదే జరిగింది. సినిమా విడుదలైన రోజు పెద్దగా సినిమాలో ఏం లేదు ఒక్క ఎన్టీఆర్ నటన తప్ప అంటూ పెదవి విరిచిన క్రిటిక్స్ కి ఇప్పుడు కలెక్షన్స్ చూస్తుంటే గొంతులో వెలక్కాయ పడినట్లయింది. అవును ఈ సినిమాలో పెద్దగా పాటలు నచ్చలేదని కొందరంటే..... అసలు కామెడీ లేకుండా సినిమా ఎలా తీసారని కొందరన్నారు. మరి పాటలు బాగోకుండా... కామెడీ లేకుండా 'జనతా గ్యారేజ్' ఇన్ని కోట్లు ఎలా వసూలు చేసిందంటారు. అంతే కాదు కొరటాల ఈసారి ప్లాప్ సినిమా తీసాడు అని కూడా ప్రచారం జరిగింది. ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపించడానికి కారణం మాత్రం ఎన్టీఆర్ స్టామినా అంటున్నారు అభిమానులు. అయితే సినిమా గురుంచి చెప్పేటప్పుడు క్రిటిక్స్ బావుంటే బావుందని బాగాలేకపోతే బాగోలేదని రాస్తున్నారు. కానీ ప్రేక్షకులు క్రిటిక్స్ చెప్పేదానికి విరుద్ధం గా సినిమాలను హిట్ చేసేస్తున్నారు. అంటే క్రిటిక్స్ అనేవాళ్ళు ప్రేక్షకులను ఏ విధం గా అంచనా వెయ్యలేకపోతున్నారనేగా దీనర్ధం. మరి నెగెటివ్ టాక్ తో రన్ అవుతున్న 'జనతా గ్యారేజ్' చిత్రం వసూళ్ల పరం గా 4 రోజులకే 50 కోట్ల క్లబ్ లో చేరి అందరికి షాక్ ఇచ్చింది. అయితే కేవలం క్రిటిక్స్ ఇచ్చే తీర్పు పైనే సినిమా భవితవ్యం ఆధారపడి ఉండదని 'సరైనోడు, జనతా గ్యారేజ్' సినిమాలు చెప్పకనే చెబుతున్నాయి.