కాంగ్రెస్ లో కేంద్ర మంత్రి హోదా వెలగబెట్టి రాష్ట్ర విభజనకు సహకరించిన పురందరేశ్వరి ఇప్పుడు బిజెపిలోకి జంప్ అయ్యి మళ్ళీ ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది. కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొట్టాక ఏపీలో కాంగ్రెస్ కి మనుగడ లేకుండా పోయింది. అందుకే ఇక ఆ పార్టీ లో ఉంటే భవిష్యత్తు శూన్యమని భావించి టిడిపిలోకి వెళదామని సకల ప్రయత్నాలు చేసి అవి వర్కౌట్ కాక కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన బిజెపిలోకి వెళ్ళింది. ఇక బీజేపీలో పెద్దగా గుర్తింపు లేకపోయినా అప్పుడప్పుడు కేంద్రం తరుపున మాట్లాడుతూ నేను పాలిటిక్స్ లో ఉన్నాననే విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా విషయం లో ఆంధ్రా లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడి వున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్రం గత 4 రోజుల క్రితం ఇంకో వారం రోజుల్లో ప్రత్యేక హోదా గురించి ప్రకటన చేస్తుంది అని చెప్పిన నేపధ్యం లో పురందరేశ్వరి గారు వార్తల్లోకొచ్చారు. ఆమె ప్రత్యేక హోదా విషయం గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ అడ్డగోలు విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, ప్రత్యేక హోదా అనే అంశంకు 14 వ ఆర్ధిక సంఘం లో అసలు చోటే లేదన్నారు. అందుకే ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఇంకా ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి సరిగా లెక్కలు చెప్పడం లేదని... పట్టిసీమ ప్రాజెక్ట్ ఖర్చులని కూడా పోలవరం ప్రాజెక్ట్ బడ్జెట్ లో చూపుతోందని విమర్శించారు. ఇక ఏపీ ప్రభుత్వం సహకరిస్తే కేంద్రం సహాయం చెయ్యడానికి సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు. అసలే చంద్రబాబు నాయుడు అంటే పర్సనల్ గా ఆమెకు పడదాయే.. అందుకే వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ఆమె చంద్రబాబు ని విమర్శిస్తోంది అంటున్నారు రాజకీయ ప్రముఖులు. ఇంకా కాంగ్రెస్ అడ్డగోలుగా విభజించినపుడు పురందరేశ్వరి కూడా కాంగ్రెస్ లోనే వుందిగా మరి అప్పుడు గుర్తు రాలేదా ఇలా అడ్డగోలు విభజనలు చేస్తే ఏపీ తీవ్రం గా నష్టపోతుందని... ఎంతయినా రాజకీయ నాయకులూ కదా అందుకే అక్కడో మాట.... ఇక్కడో మాట.