Advertisementt

'పెళ్లిచూపులు' రాత మార్చేసింది..!

Tue 06th Sep 2016 08:45 PM
pelli choopulu,priyadarshi,mahesh and murugadoss movie,pelli choopulu comedian in mahesh movie  'పెళ్లిచూపులు' రాత మార్చేసింది..!
'పెళ్లిచూపులు' రాత మార్చేసింది..!
Advertisement
Ads by CJ

'పెళ్లిచూపులు' ఒక చిన్న సినిమాగా విడుదలై ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఇంకా వసూళ్ళలో కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్స్ కే కాక నటీనటులకి కూడా మంచి గుర్తింపు వచ్చింది. హీరోయిన్ రీతూ వర్మకి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇక హీరో విజయ్ దేవరకొండకి ఇంకా మంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో నటించిన కమెడియన్ ప్రియదర్శికి అయితే బంపర్ ఆఫర్ తలుపుతట్టింది. ఆ ఆఫర్ మహేష్ బాబు రూపం లో ప్రియదర్శి ఇంటి తలుపు తట్టిందని సమాచారం. 'పెళ్లిచూపులు' సినిమాలో ఇతగాడి కామెడీ మహేష్ కి తెగ నచ్చిందని అందుకే ఈ ఆఫర్ ఇస్తున్నట్లు సమాచారం. ప్రియదర్శి 'పెళ్లిచూపులు' సినిమాలో 'నా చావు నే చస్తా - నీకెందుకు' అనే కామెడీ డైలాగ్ తనదైన స్టైల్ లో చెప్పి అందరిని కడుపుబ్బా నవ్వించాడు. ఒకే ఒక్క డైలాగ్ తో అందరి నోటిలో పడిపోయాడు ఈ ఫ్రెష్ కమెడియన్. అందుకే ఒక్కసారిగా మహేష్ అంతటి వాడి సినిమాలో కమెడియన్ గా చోటు సంపాదించాడు అంటున్నారు. మహేష్ - మురుగదాస్ కాంబినేషన్ తెరకెక్కుతున్న చిత్రం లో ఒక కొత్త కమెడియన్ కోసం వెతుకుతూ.. దర్శకుడు 'పెళ్లిచూపులు' కమెడియన్ ని ఒకే చేసినట్లు సమాచారం. అందుకే ఈ చిత్రం లో మహేష్ పక్కన నటించే అవకాశం ప్రియదర్శికి వచ్చినట్లు సమాచారం. ఒకే ఒక్క సినిమా చేసిన ప్రియదర్శిని కి.. సూపర్ స్టార్ తో కలిసి నటించే ఛాన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు. మరి 'పెళ్లి చూపులు' సినిమా ఇంకా ఎన్నిసెన్సేషన్స్ కి నెలవు కానుందో...?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ