Advertisementt

అందులో వర్మ సక్సెస్ అయ్యాడు..!

Tue 06th Sep 2016 08:36 PM
ram gopal varma,rgv,teachers day,twitter,varma comments on teachers day  అందులో వర్మ సక్సెస్ అయ్యాడు..!
అందులో వర్మ సక్సెస్ అయ్యాడు..!
Advertisement

రాధాకృష్ణన్ జన్మదినాన్ని(సెప్టెంబర్ 5) దేశమంతా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారనేది తెలిసిన విషయమే.  అయితే ఉపాధ్యాయ దినోత్సవం రోజున సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నెగెటివ్ కామెంట్స్ చేస్తూ ట్విట్టర్ లో టీచర్స్ పై ట్వీట్స్ చేశాడు. అసలు చెప్పాలంటే ఉపాధ్యాయులను కించ పరిచేలా అగౌరవం గా మాట్లాడాడు. రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో యువత పాఠశాలలకు వెళ్లి ఏం నేర్చుకుంటారు... నాలా సినిమాలు చూడండి గొప్ప డైరెక్టర్ అవుతారు అంటూ ట్వీట్స్ చేసిన సంగతి విదితమే. నేను స్కూల్ కి వెళ్లకుండా సినిమాలు చూసేవాడినని అందుకే ఇలా గొప్ప స్థానం లో వున్నానని .... ఇంకా టీచర్స్ అంటే ఇష్టం లేదుకానీ టీచర్స్ బ్రాండ్ వైన్ అంటే ఇష్టమని తనకు ఇష్టం వచ్చినట్లు ట్వీట్లు చేసిన రామ్ గోపాల్ వర్మ పై  ఉపాధ్యాయ సంఘాలు ఫైర్ అవుతున్నాయి.  వర్మ ట్వీట్స్ ని ఉపాధ్యాయ సంఘాలు తప్పుపడుతున్నాయి. వర్మ అలా ఉపాధ్యాయులను కించపరిచేలా మాట్లాడి ఉండకూడదని అంటున్నారు. అసలు వర్మ ఏం ఆశించి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడు అని తిడుతున్నారు. విజయవాడలో అయితే కొంతమంది ఉపాధ్యాయులు వర్మ పై కేసు కూడా పెట్టారు. తన మీద ఉపాధ్యాయ సంఘాలు కేసు పెట్టిన సంగతిని కూడా వర్మే బయటపెట్టాడు. అసలు దీనికి కారణం ఏమిటా అని ఆలోచిస్తే గత కొంత కాలం గా తీసిన సినిమాలన్నీ వరసగా ప్లాప్ అవడం తో తన పేరు మరుగున పడిపోతుందని భావించిన వర్మ ఇలా ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకుని ఇలా ట్వీట్స్ చేస్తూ నేను ఉన్నాను అనే భావన కలిగించడానికి ఇలా చేస్తున్నాడని అంటున్నారు. అంతేగా మరి ఏ పని లేనివాడు ఇలాంటి ఏదో పని చెయ్యాలిగా.... నిత్యం వార్తల్లో నిలవడానికి అని ప్లాన్ చేసినట్లు వున్నాడు వర్మ. ఈ విధం గా వర్మ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement