ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టె.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై విరుచుకు పడ్డాడు. అగ్రరాజ్యాధినేత అన్న విషయాన్ని కూడా మర్చిపోయి రోడ్రిగో ఆవేశంతో ఒబామాను నోటికొచ్చినట్లు తిట్టాడు. ఒబామా ఓ వేశ్యకు పుట్టిన వాడు అంటూ దారుణంగా మాట్లాడాడు. దీంతో ఒబామాకు ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చింది. ముందుగానే షెడ్యూల్ ప్రకారం ఒబామా, రోడ్రిగో సమావేశం ఖరారైంది. ఆ సమావేశాన్ని ఒబామా అర్ధాంతరంగా రద్దు చేసుకున్నాడు. కాగా వియత్నాం రాజధాని లావోస్‌లో దక్షిణాసియా దేశాధినేతల వార్షిక సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తొలిసారిగా ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగోతో షెడ్యూల్ ప్రకారం ఒబామా భేటీ ఉంది. ఫిలిప్పీన్స్‌లో రోడ్రిగో డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపడం, ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కారణంగా ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించాడు.
కాగా చైనాలోని హాంగ్‌ఝౌలో జీ20 సదస్సు తర్వాత ఒబామా రోడ్రిగో చేసిన వ్యాఖ్యలను వైట్‌హౌస్ సిబ్బంది ద్వారా తెలుసుకున్నాడు. దీంతో ఒబామా ఒక్కసారిగా నిర్ఘాంతపోయి రోడ్రిగోతో సమావేశం దండుగ అని నిర్ణయం తీసుకున్నాడు. నిజంగా ఒబామా జీవితంలో చాలా ప్రణాళిక బద్దంగా, పకడ్బందీ వ్యూహంతో నిర్మాణాత్మక వైఖరితో ఉండటం వల్లనే ఉన్నత శిఖరాలను అధిరోహించగలిగాడు. ఈ సందర్భాంగా ఒబామా మాట్లాడుతూ..... తాను ఏ దేశస్థుడితోనైనా చర్చలు జరపాలంటే.. అవి చాలా నిర్మాణాత్మక వైఖరితో, భావితరాలకు ప్రతిఫలాన్నిచ్చేవిగా ఉండాలని తాను కోరుకుంటానని వివరించాడు. కాగా అమెరికా అధ్యక్షుడు ఒకరు వియత్నాంకు రావడం ఇదే మొదటిసారి. ట్విస్ట్ ఏమంటే దురుసుగా వ్యాఖ్యలు చేసిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో ఆ తర్వాత పశ్చాత్తాప పడి తన విచారాన్ని వ్యక్తం చేశాడు.