Advertisement

పైరసీపై ముంబై హైకోర్టు దిమ్మతిరిగే తీర్పు!

Tue 06th Sep 2016 06:34 PM
piracy,mumbai high court,producers,high court judgement on piracy,movies  పైరసీపై ముంబై హైకోర్టు దిమ్మతిరిగే తీర్పు!
పైరసీపై ముంబై హైకోర్టు దిమ్మతిరిగే తీర్పు!
Advertisement

పైరసీ పెద్ద పెనుభూతం అంటూ సినీ పెద్దలంతా గగ్గోలు పెడుతుంటే కోర్టులు మాత్రం పైరసీ ముద్దేనంటూ తీర్పులిచ్చేస్తున్నాయి.  కాగా పైరసీ భూతంపై ముంబై హైకోర్ట్ తీర్పు సంచలనం రేపుతుంది. జస్టిస్ గౌతమ్ కుమార్ తో కూడిన ధర్మాసనం పైరసీ ద్వారా సినిమాలు చూడడం నేరం కాదని తీర్పునిచ్చి సంచలనానికి దారితీసింది. కానీ ఇవి పబ్లిక్ గా చూడడం, షేర్ చేయడం వంటివి మాత్రం నేరం కిందే పరిగణించాల్సి వస్తుందని వెల్లడించింది.

కాగా పైరసీ బాగా ఎక్కువై పోవడంతో తాము చాలా నష్టపోవాల్సి వస్తుందని ఈ మధ్య పైరసీపై ముంబై ఫిల్మ్ ప్రొడ్యూసర్ ల సమాఖ్య హైకోర్ట్ లో పిటిషన్ వేసింది. అయితే దీనిపై విచారణ జరిపిన హైకోర్ట్..పైరసీ పెద్ద నేరమేం కాదన్నట్లుగా నెగెటివ్ తీర్పును వెల్లడించింది. ఈ విధమైన తీర్పును హైకోర్టు వెలువరించడంపై నిర్మాతలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కానీ గతంలో పైరసీ సినిమాలు ఉన్న వెబ్ సైట్లను బ్లాక్ చేయమని హైకోర్ట్ ఆదేశించిన విషయం తెలిసిందే.  ఈ తీర్పుతో కొన్ని మామూలు వెబ్ సైట్లు కూడా మూతపడ్డాయి.  కొన్ని పైరసీ సైట్లను ఓపెన్ చేస్తే ఎర్రర్ మెసేజ్ వచ్చేలా చేయమని కూడా కోర్టు ఐ ఎస్ పి లకు సూచించింది. అంతటితో ఆగకుండా వీడియో లు డౌన్ లోడ్ కాకుండా జాగ్రత్త తీసుకోమని కూడా సూచించింది. ఇన్ని రకాలుగా చెప్పిన కోర్టే ఇప్పుడు ఫైరసీ నేరమేం కాదంటూ తీర్పు చెప్పడం చాలా విడ్డూరంగానూ, ఓ రకంగా బ్లాక్ మార్కెట్ దళారులకు ఊతమిచ్చేలాగానూ ఉంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement