టాలీవుడ్ ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున ఇంట్లో త్వరలో పెళ్లిబాజాలు మోగనున్నాయా, అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కాగా నాగార్జున తాజాగా మాట్లాడుతూ తన కుటుంబం నుంచి ఇద్దరు యువ హీరోలు, ముద్దుల కుమారులైన నాగచైతన్య, అఖిల్ ల వివాహం విషయంపై తాను త్వరలో స్పందిస్తానని వెల్లడించాడు. ఈ విషయంపై తానే స్వయంగా ఓ ప్రకటన చేయాలనుకుంటున్నట్లు వివరించాడు. తాజాగా నాగార్జున స్పందిస్తూ... ఈ యువహీరోల విషయంలో సరైన సమయంలో, మంచి ముహూర్తం చూసుకుని వివరాలు తెలియజేస్తానని నాగార్జునే చెప్పేశాడు.
కాగా ఈ మధ్యనే తన కుటుంబం నుండి త్వరలో రెండు పెళ్ళిళ్ళు ఉంటాయంటూ నాగార్జున వెల్లడించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ వారి వారి జీవిత బాగస్వాములను వారే ఎన్నుకోవడం తనకు, తన సతీమణి అమలకు చాలా సంతోషంగా ఉందని కూడా నాగార్జున చెప్పాడు. అయితే నాగ చైతన్య, స్టార్ హీరోయిన్ సమంత లవ్ లో ఉండగా, అఖిల్ మాత్రం ఫ్యాషన్ డిజైనర్ శ్రీయా భూపాల్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. చూద్దాం త్వరలో నాగార్జునే స్వయంగా ఎలా స్పందిస్తాడో.... ?