Advertisementt

కొరటాల.. కసితో డైరెక్టర్ అయ్యాడంట!

Tue 06th Sep 2016 01:26 PM
koratala siva,director,writer turned director,mirchi,srimanthudu,janatha garage,koratala siva about his direction  కొరటాల.. కసితో డైరెక్టర్ అయ్యాడంట!
కొరటాల.. కసితో డైరెక్టర్ అయ్యాడంట!
Advertisement
Ads by CJ

కొరటాల శివ వరసగా 3  సినిమాల హిట్స్ తో తనకంటూ ఒక ఇమేజ్ ని సంపాదించుకున్న డైరెక్టర్, తీసిన 3  సినిమాలు అతనికి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. కొరటాల శివ డైరెక్టర్ కాకముందు ఒక రైటర్. అయితే కొరటాల రైటర్ గా వున్నప్పుడు ఒక్కోసిన్మాకి 10 లక్షలు మాత్రమే అందుకున్నాడట. అసలు డైరెక్టర్ అవ్వడానికి కారణం మాత్రం సరైన గుర్తింపు కోసమేనట. ఈయన రైటర్ గా వున్నప్పుడు తన కథని తీసుకుని సినిమాని చేసిన దర్శక నిర్మాతలు కనీసం తన పేరుని టైటిల్స్ లో కూడా వెయ్యలేదట. అంటే రైటర్స్ కి పెద్దగా గౌరవం ఉండదని కొరటాల శివ ఫీలింగ్. తన కథతో సినిమా తీసి అది హిట్ అయితే తన పేరు లేకపోతె బాధకలుగుతుంది ఎవరికైనా బాధేస్తుంది కదా!. ఇలాంటి అనుభవాన్ని కొరటాల 'సింహా' సినిమా అప్పుడు ఫేస్ చేశానని ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పేర్కొన్నాడు. అందుకే పట్టుదలగా డైరెక్టర్ అవ్వాలని అనుకున్నానని... నా దగ్గర 10 కథలు ఉన్నాయని... ఇప్పటికి వియజయవంతం గా 3  సినిమాలు తీశానని ఇంకా మిగతావి కూడా చేస్తానని చెప్పాడు. తన మొదట కథతో ప్రభాస్ ని కలిసినప్పుడు ఆ కథ బాగా నచ్చి ప్రభాస్ హీరోగా చెయ్యడానికి ఒప్పుకున్నాడని తెలిపాడు. కొద్ది గ్యాప్ అర్వాత ప్రభాస్ ఫోన్ చేసి నువ్ డైరెక్టర్ గా చేస్తున్నావని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చాడు. ఇంకా తాను ఎంత వర్క్ బిజీగా వున్నా మార్నింగ్ 9 నుండి సాయంత్రం 6 వరకే పని చేస్తానని ఇక తర్వాత ఇంటికెళ్ళిపోతానని చెప్పాడు. అయితే ఇపుడు తన 4 వ సినిమాని మహేష్ తో చేస్తున్నానని... ఈ కథ మా ఇద్దరికి బాగా నచ్చిందని చెప్పాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ