ఏడాదికి నాలుగైదు చిత్రాలు, కనీసం ఏడాదికి రెండు హిట్లు అందుకొంటూ వస్తున్న మాస్‌మహారాజా రవితేజ 'బెంగాల్ టైగర్' తర్వాత ఇంత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. కాగా ఇటీవలి కాలంలో ఆయన నటించిన 'కిక్2' తప్ప మిగిలిన ప్రాజెక్ట్‌లన్నీ ప్రాఫిట్‌గానే నిలిచాయి. 'పవర్, బెంగాల్‌టైగర్' చిత్రాలు హిట్ చిత్రాలుగా కూడా నిలిచాయి. అయితే రవితేజ చేయాల్సిన 'ఎవడో ఒక్కడు' ప్రాజెక్ట్ అట్టకెక్కింది. ఇక నూతన దర్శకుడు చక్రి దర్శకత్వంలో 'రాబిన్‌హుడ్', ఆ తర్వాత విక్రమ్ సిరి అనే నూతన దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. కానీ ఏవీ పట్టాలెక్కలేదు. తన ఫేస్‌లో గ్లామర్, ఎనర్జీ లెవల్స్ కూడా తగ్గాయనే విమర్శలు వస్తున్నాయి. కాగా గతంలో రవితేజతో సినిమాలు చేసిన వారు ఇప్పుడు అదే తరహా పాత్రలను చేస్తోన్న మెగాహీరో సాయిధరమ్‌తేజ్‌తో ముందు కెలుతున్నారని కూడా ప్రచారం మొదలైంది. ఇక ఎట్టకేలకు రవితేజ తనతో 'పవర్' తీసిన బాబితోనే పనిచేయనున్నాడని, ఈ చిత్రానికి 'క్రాక్' అనే టైటిల్ కూడా తెరపైకి వచ్చింది. కాగా ఈ చిత్రాన్ని ఈనెల 26న ప్రారంభించాలని రవితేజ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేలను కోనవెంకట్ అందిస్తున్నాడని సమాచారం. మొత్తం మీద మాస్‌మహారాజా రవితేజ తన ముహూర్తాన్ని ఖరారు చేసినా.. సెప్టెంబర్ 26న ప్రారంభిస్తాడా? లేక ఈ చిత్రాన్ని కూడా హోల్డ్‌లో పెడతాడా? అనేది ఎదురుచూడాల్సిన విషయం.