Advertisementt

అమలాపాల్ విలన్ రజనీకాంతేనంట..!

Sun 04th Sep 2016 10:26 PM
rajinikanth,amala paul,vada chennai,dhanush,affair between amala paul and dhanush  అమలాపాల్ విలన్ రజనీకాంతేనంట..!
అమలాపాల్ విలన్ రజనీకాంతేనంట..!
Advertisement
Ads by CJ

తన కెరీర్‌ కోసం దర్శకుడు విజయ్‌ను పెళ్లాడిన నటి అమలాపాల్‌ తన భర్తకు విడాకుల ఇవ్వడానికి కూడా సిద్దమైపోయింది. తాజాగా అమలాకు సంబంధించిన రెండు లేటెస్ట్‌ న్యూస్‌లు కోలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ రెండు విషయాలు ఒకటికొకటి విరుద్దంగా ఉండటం విశేషం. కాగా తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ తాను నటించే 'వడాచెన్నై' చిత్రంలో అమలాపాల్‌కు అవకాశం ఇచ్చాడు. అలా ఆమె నటించడం భర్త విజయ్‌కి నచ్చలేదు. కానీ ధనుష్‌తో సినిమా అనేసరికి ఆమె కెరీర్‌ కోసం వివాహబంధాన్ని కూడా వదులుకోవడానికి రెడీ అయింది. మరోపక్క సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో ఆయన అల్లుడు ధనుష్‌ నిర్మాతగా 'కబాలి' డైరెక్టర్‌ రంజిత్‌పా దర్శకత్వంలో 'రోబో 2.0' తర్వాత రజనీ ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రంలో కూడా రజనీకి జోడీగా అమలాపాల్‌ను తీసుకున్నాడు ధనుష్‌. ఇదే నిజమైతే అమలాపాల్‌ అదృష్టం దశ తిరుగుతుందని కొందరు అంటున్నారు. మరి కొందరు మాత్రం రజనీకాంత్‌ తన అల్లుడు ధనుష్‌ ప్రస్తుతం అమలాపాల్‌ మాయలో పడిపోయాడని, అందువల్ల తన కుమార్తె జీవితం ఇబ్బందుల్లో పడుతున్నదని గమనించి 'వడాచెన్నై'తో పాటు తాను రంజిత్‌పాతో చేసే చిత్రంలో కూడా అమలాపాల్‌ను పక్కనపెట్టాడని, అంతటితో ఆగకుండా అమలాపాల్‌ సినీ కెరీర్‌కు సంబంధించి విషయంలో ఆమెపై అనధికార బ్యాన్‌ విధించాడని, ఇకపై ఆమెకు సినిమా అవకాశాలు ఇవ్వవద్దని రజనీ ఇండస్ట్రీలోని అందరికీ ఈ విషయాన్ని తెలిపాడని అంటున్నారు. ఇంతకాలం అమలాకు అవకాశాలు రాకుండా ఉండటానికి కారణం విజయ్‌ తండ్రి అని అందరూ భావిస్తున్నారు. కానీ ఆమెకు అవకాశాలు రాకుండా ఆమెపై అప్రకటిత బ్యాన్‌కు కారణం రజనీయే అనే విషయం కోలీవుడ్‌లో చర్చనీయాంశం అయింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ