నటునిగా, దర్శకునిగా తనదైన ప్రత్యేక పంథాను అనుసరిస్తున్న అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన 'జ్యో అచ్యుతానంద' చిత్రం ఈ నెల 9 వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. నారారోహిల్, నాగశౌర్య, రెజీనా ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ చిత్రం వారాహి చలనచిత్రం బేనర్‌లో రూపొందుతోంది. ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్ మంచి స్పందనను పొందుతోంది. కాగా ఈ చిత్రం క్లైమాక్స్‌లో నేచురల్‌స్టార్ నాని ఓ అతిధి పాత్రలో మెరవనున్నాడని సమాచారం. ఈ సీన్ సినిమా మొత్తానికి హైలైట్‌గా నిలుస్తుందని యూనిట్ భావిస్తోంది. దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌తో ఉన్న స్నేహం, వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటితో ఉన్న ప్రత్యేక గౌరవం వల్లే ఈచిత్రంలో నాని గెస్ట్‌రోల్ చేశాడని తెలుస్తోంది. కాగా ఈ విషయాన్ని విడుదల వరకు సస్పెన్స్‌లో ఉంచి సినిమా చూస్తున్న ప్రేక్షకులకు థ్రిల్ ఇవ్వాలని దర్శకనిర్మాతలు గోప్యంగా ఉంచుతున్నారని, మరి ఈ వార్త నిజమా? కాదా? అన్నది సెప్టెంబర్9న ఈ చిత్రం విడుదలైతే కానీ తెలియదని అంటున్నారు.