'జనతా గ్యారేజ్' సినిమాపై మొదటి రోజు నుంచి మిక్స్ డ్ టాక్ వస్తున్నవిషయం తెలిసిందే. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం వసూళ్ళ వర్షం కురుస్తుంది. 'జనతా గ్యారేజ్' విడుదలైనప్పటి నుండి వరుసగా సెలవులు రావడం కూడా ఈ స్థాయి వసూళ్ళకు కారణమని చెప్పవచ్చు. తాజాగా 'జనతా గ్యారేజ్' సినిమా మరో మైలురాయిని అధిగమించింది. ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్ల మార్కుని దాటేసింది. ఓవర్సీస్ లో ప్రీమియర్ షోస్ పరంగా కూడా వసూళ్ళ సునామీని సృష్టించిన విషయం తెలిసిందే. కాగా గతంలో 'బాహుబలి, సర్దార్ గబ్బర్‌సింగ్'ల తర్వాత స్థానాన్ని 'జనతా గ్యారేజ్' కైవసం చేసుకుందని తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే యూఎస్‌లో కూడా ఈ వీకెండ్ లో మరిన్ని వసూళ్లు రాబట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
'జనతా గ్యారేజ్' మిలియన్ మార్కుని దాటగానే జానియర్ ఎన్టీఆర్ పేరిట మరో కొత్త రికార్డు నమోదైంది. మిలియన్ మార్క్ అందుకోవడంలో హ్యాట్రిక్ నమోదు చేసిన రెండో హీరోగా జానియర్ ఎన్టీఆర్ నిలిచాడు. దీంతో జానియర్ ఎన్టీఆర్ నటించిన వరుస సినిమాలు 'టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్' మిలియన్ డాలర్ల వసూళ్లను సొంతం చేసుకొన్నవే. కాగా ఇప్పటివరకు మహేష్ బాబు మాత్రమే ఇటువంటి అరుదైన ఘనతను సాధించాడు. ఆ తర్వాత జానియర్ ఎన్టీఆర్ సాధించాడు. ఇంతటి ఘనమైన రికార్డు సాధించిన ఎన్నారై ప్రేక్షకులకు జానియర్ ఎన్టీఆర్ త్వరలోనే ప్రత్యేక కృతజ్ఞతలు తెలపనున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం ఉన్న 'జనతా గ్యారేజ్' రేంజ్ చూస్తే ఓవర్సీస్‌లో మరో మిలియన్ అన్నా సొంతం చేసుకోవడం ఏమంత కష్ట కాదని ట్రేడ్ వర్గాల నుండి సమాచారం అందుతుంది.