Advertisementt

తాత్కాలిక సచివాలయానికి అంత ఖర్చెందుకు బాబు..!

Sun 04th Sep 2016 07:58 PM
chandrababu naidu,ap government,temporary,secretariat,budget  తాత్కాలిక సచివాలయానికి అంత ఖర్చెందుకు బాబు..!
తాత్కాలిక సచివాలయానికి అంత ఖర్చెందుకు బాబు..!
Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలోని వెలగపూడి పరిసరాల్లో ప్రభుత్వం తాత్కాలిక సచివాలయాన్ని నిర్మిస్తుంది. అందుకోసం అంచనా వేసుకున్న దానికంటే ప్రభుత్వం చాలా ఎక్కువగా ఖర్చుపెట్టేస్తుంది. తాత్కాలిక సచివాలయం అంటూనే ఇంత భారీగా ఖర్చు పెట్టడం అవసరమా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాగా ఇప్పటివరకు సచివాలయానికి మాత్రమే రూ. 600 కోట్లకు పైగా ఖర్చుపెట్టారు. ఇంకా ఇది పూర్తి కావడానికి మరో రూ.200 నుండి రూ. 250 కోట్లు ఖర్చవుతుందని అంచనా. రాజధానికి అనుసంధానంగా ఉన్న ఎక్స్ ప్రెస్ వేకు సంబంధం లేకుండానే ఇంత ఖర్చవుతుంది.

గతంలో వేసిన లెక్కల ప్రకారం తాత్కాలిక సచివాలయం రాజధాని ఎక్స్ ప్రెస్ వేకు అనుసంధానం చేసేందుకు మొత్తం రూ.850 కోట్ల వరకు అవుతుందని ప్రభుత్వం ప్రతిపాధనలు పంపింది. ఇంకా అసెంబ్లీ శాసన మండలి భవన నిర్మాణానికి అదనంగా మరో రూ.150 కోట్ల నుండి రూ. 200 కోట్ల వరకు అవుతుందని చెప్తున్నారు. అంటే దీంతో కేవలం తాత్కాలిక సచివాలయ నిర్మాణం ఖర్చు వెరసి రూ వెయ్యి కోట్లు అవుతుందని అంచనా. కాగా రాజధాని పరిసర ప్రాంతాల్లో కృష్ణపుష్కరాలకని సుమారు వెయ్యి కోట్లనుకొని రూ.18 కోట్ల ఖర్చు చేసి అది ఇంకా పూర్తి లెక్కలయ్యేసరికి రూ.2 వేల కోట్లు మించిపోతుందని తెలుస్తుంది. కాగా తాత్కాలిక సచివాలయం అంటూనే ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వం విచ్చలవిడిగా ఖర్చు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.     

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement