జోరుమీదున్న రకుల్‌ప్రీత్ సింగ్ మరో అవకాశాన్ని చేజిక్కించుకొందా? ఈసారి అక్కినేని నాగచైతన్యతో కలిసి నటించబోతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. `సోగ్గాడే చిన్నినాయనా` ఫేమ్ కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ నెలలోనే ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ సినిమాలో హీరోయిన్‌గా రకుల్‌ప్రీత్ సింగ్ నటించబోతోందని తెలిసింది. మొదట సమంత, తమన్నా పేర్లు వినిపించినా... వాళ్లిద్దరికీ తీరిక లేకపోవడంతో ఆ ఆఫర్ రకుల్‌కి దక్కినట్టు తెలిసింది. ప్రస్తుతం రకుల్ రామ్‌చరణ్, మహేష్‌బాబులతో నటిస్తోంది. త్వరలో సాయిధరమ్ తేజ్‌తోనూ సినిమా చేయబోతోంది. ఇప్పుడు చైతూ సినిమాకీ ఓకే చెప్పేసింది. కాల్షీట్లు ప్లాన్ చేసుకోవడంలో రకుల్‌కి సాటి మరొకరు లేరని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఆమె ప్లానింగ్ వల్లే వరుసగా క్రేజీ ఆఫర్లు దక్కుతున్నాయని చెప్పుకొంటున్నారు.