ప్రముఖ బుల్లితెర యాంకర్, నటి అయిన ఉదయభాను ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఉదయభాను ముందుగానే తన గర్భంలో కవల పిల్లలున్న విషయాన్ని వెల్లడించిన విషయం కూడా తెలిసిందే. కాగా నిన్న హైదరాబాద్ లోని బంజారాహిల్స్ బర్త్ ప్లేస్ హాస్పిటల్ లో ఉదయభాను ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఆ ఇద్దరూ ఆడ పిల్లలనీ, తల్లీ బిడ్డలూ క్షేమంగా ఉన్నారని సమాచారం అందుతుంది.
కాగా మంచి మాటకారిగా, యాంకర్ గా ఉదయ భాను బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నది. ఇంకా వెండితెరపై ఆమె జులాయి, లీడర్ వంటి చిత్రాల్లో అందులోని ప్రత్యేక గీతాల్లో కూడా నటించింది. కాగా సుమారు దశాబ్దానికి పైగా ఉదయ్ భాను ప్రముఖ యాంకర్ గా కొనసాగింది. చాలా కాలం క్రితం ఉదయ భాను విజయ్ కుమార్ ను ప్రేమ వివాహం చేసినుకున్న విషయం తెలిసిందే.