సెలబ్రిటీ ల పిల్లలు ఏం చేసినా అది వింతగానే కనబడుతుంది. అందునా వాళ్ళు కూడా సెలెబ్రిటీస్ అయి ఉండి వారి తలితండ్రులకి ఏదైనా కొని పెట్టిన లేక వారితో మాట్లాడినా కూడా మీడియా ఓవర్ రియాక్ట్ అయి దానిని తెగ ప్రచారం చేసేస్తుంటుంది. ఇప్పుడదే జరిగింది. అప్పుడెప్పుడో నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ తన తండ్రికి పుట్టినరోజు కానుకగా ఒక కారుని గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అది సోషల్ మీడియా లో తెగ ప్రచారం జరిగింది. తన తండ్రి కి అతనేదో ప్రేమగా కారుని గిఫ్ట్ ఇచ్చాడు. దానికే ఇంత ఇదిగా చెయ్యాలా అని సెటైర్స్ కూడా వేశారు. ఇక ఇప్పుడు వరుణ్ బాటలోనే అక్కినేని అఖిల్ కూడా తన తండ్రికి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. నాగార్జున పుట్టినరోజు స్పెషల్ గా అఖిల్ ప్రేమగా ఒక బీఎండబ్ల్యూ కారుని కానుకగా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో పిక్స్ హల్ చల్ చేస్తున్నాయి. మరి అఖిల్ తన తండ్రికి ప్రేమగా మంచి గిఫ్టే ఇచ్చాడుగా అంటున్నారు అక్కినేని అభిమానులు. ఇక ఈ గిఫ్ట్ అందుకున్న నాగార్జున తెగసంతోషపడిపోతున్నాడట. ఎంతైనా పుత్రోత్సాహం కదా అలాగే అనిపిస్తుంది. ఇక అక్కినేని ఫ్యామిలీ కి ఈ సెప్టెంబర్ అంతా తెగ కలిసొచ్చే నెలలా అనిపిస్తుంది. ఎందుకంటే నాగ్ బర్త్ డే కానుకగా కారుని అందుకున్నాడు... అలాగే తన పెద్ద కొడుకు నాగ చైతన్య సినిమా ఓపెనింగ్ కూడా ఈ నెలలో ఉంటుందని ఎనౌన్స్ కూడా చేసాడు. ఈ సినిమా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ఉంటుందని ఆఫీషియల్ గా చెప్పాడు. అంతే కాదు తన రెండో కొడుకు అఖిల్ సినిమా విక్రమ్ డైరెక్షన్ లో ఈ నెలలోనే పట్టాలెక్కుతుందని నాగ్ ఓపెన్ గా చెప్పేసాడు. ఇక ఫైనల్ గా అక్కినేని నాగేశ్వర రావు పుట్టిన రోజు కూడా ఈ నెల 20 న ఉండడం తో అక్కినేని ఫ్యామిలీ అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారట. ఒకేసారి ఇన్ని సంతోషకరమైన వార్తలు వచ్చేస్తే ఇలాగే ఉంటుంది. ఇంకేముంది అక్కినేని అభిమానులకి పండగే పండగ.