Advertisementt

పవన్ నాయకుడవ్వడం ఏపీ ప్రజల అదృష్టం!

Sat 03rd Sep 2016 09:15 PM
pawan kalyan,andhra pradesh people,ram gopal varma,rgv twits about pawan kalyan  పవన్ నాయకుడవ్వడం ఏపీ ప్రజల అదృష్టం!
పవన్ నాయకుడవ్వడం ఏపీ ప్రజల అదృష్టం!
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ అభిమానులకు ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాం గోపాల్ వర్మకు నిరంతరం సోషల్ మీడియా వేదికగా యుద్ధం జరుగుతూ  ఉంటుంది. గతంలో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గురించి, వారి అభిమానుల గురించి నెగెటివ్ గా కామెంట్స్ చేసిన వర్మ వారి అభిమానుల ఆగ్రహావేశాలకు గురయ్యాడు. అది ఎంతవరకు వచ్చిందంటే తాను ఇక పవన్ కళ్యాణ్ పై ఎటువంటి కామెంట్ పోస్ట్ చేయను అని వర్మ అనేంత వరకు వచ్చింది. అలా వాద వివాదాలకు గురైన వర్మ, పవన్ ఫ్యాన్స్ వ్యవహారం గతంలో గబ్బర్ సింగ్ టైమ్ లోనూ, ఇప్పుడు తిరుపతి బారీ బహిరంగ సభతో తీరిపోయినట్టయింది. ఎన్నాళ్ళ నుండో ఆపుకొని ఒక్కసారిగా వర్మ.. పవన్ కళ్యాణ్ పై అభిమానాన్ని గుప్పించి వదిలాడు. 

ఏపీ ప్రజలకు పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించడమంటే అది  ఆ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమనే చెప్పాలన్నాడు. పవన్ వంటి నిజాయితీ పరుడు మరొకరు లేరన్నాడు. ఇంకా ఆయన తీక్షణమైన ఆలోచనా విధానమే పవన్ ను స్టార్ డమ్ చేసిందని కూడా ట్వీటాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ తానెప్పుడూ పవన్ గురించి మంచి ఆలోచనతోనే పోస్ట్ చేస్తానని ఈ పవన్ ఫ్యాన్స్ తనను అపార్ధం చేసుకుంటున్నారని కూడా వెల్లడించాడు. ఇంకా పవన్ లో నిజాయితీతో కూడిన నాయకత్వ లక్షణం ఉందని అదే ఆయనను ముందుకు నడిపిస్తుందని వెల్లడించాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ