పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవన్ ను ప్రముఖులంతా అభినందనలతో ముంచెత్తుతున్నారు. పవన్ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. జన సేనానిగా తిరుపతి వేదికగా పవన్ అద్భుతంగా ప్రసంగించి అందరి ప్రశంసలూ పొందాడు. ఆ దిశగా కూడా చూస్తే పవన్ కు ఈ పుట్టిన రోజు చాలా ప్రత్యేకమైందిగా చెప్పవచ్చు. కాగా పవన్ కు చాలా మంది సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
పవన్ అభిమానులకు పవన్ గురించి తెలియని విషయాలంటూ ఏమీ ఉండవు. ఎందుకంటే పవన్ జీవితం తెరచిన పుస్తకం. కానీ పవన్ మేనల్లుడు అల్లు శిరీష్ పవన్ గురించిన అభిమానులకు కూడా తెలియని కొన్ని రహస్య విషయాలను వెల్లడించాడు. అవేమంటే 'పవన్ కు ఎప్పుడూ ప్రకృతి అందించిన సహజమైన వాటిపైనే దృష్టి ఉంటుంది. ఉసిరికాయలు ఎక్కువగా తింటూ ఉంటాడు. అతని గ్లామర్ కు కారణం అవేనన్నది నా అభిప్రాయం అన్నాడు.ఇంకా అతను ఆయుర్వేదాన్ని ఉపయోగిస్తాడన్నాడు. అందరూ హత యోగాన్ని ప్రాక్టీస్ చేస్తే. పవన్ మాత్రం మోస్ట్ అడ్వాన్సు డ్ అష్టాంగ యోగాన్ని సాధన చేస్తాడు' అన్నాడు.
ఇంకా పవన్ కళ్యాణ్ గురించి అల్లు శిరీష్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. పవన్ అమిత పుస్తక ప్రియుడన్నాడు. పవన్ ఎక్కువగా రాజకీయాలు, వేదాంతం, తత్త్వవేత్తలకు చెందిన పుస్తకాలను ఎక్కువగా చదువుతాడన్నాడు. చివరగా 2007లో శిరీష్ కు కారు యాక్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ తనను చూడటానికి వచ్చి కన్నీరు పెట్టుకున్నాడన్నాడు. ఈ ఒక్క విషయం చాలు పవన్ మనస్సు ఎంత సున్నితమైందో తెలియజేయడానికి అన్నాడు అల్లు శిరీష్.