కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటే కొన్ని సమస్యలు ఉన్నాయని... వాటిని పరిష్కరించి ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారని చెబుతున్నాడు. కేంద్ర రాయబారిగా చెలామణి అవుతున్న సుజనా చౌదరి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇలా చెప్పుకొచ్చాడు. అంటే కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఎలాగోకలా సరిపెట్టుకోండి అని చెప్పకనే చెబుతున్నట్టు వుంది అంటున్నారు విమర్శకులు. ఇంకో వారం రోజుల్లో కేంద్రం నుండి ప్రత్యేక హోదా కోసం ప్రకటన వస్తుంది అన్న సమయం లో ప్రెస్ మీట్ పెట్టి మరీ సుజనా ఇదంతా చెప్పుకొచ్చాడు అంటే కేంద్రానికి వకాల్తా పుచ్చుకుని ఏపీ ప్రజలను ముందు నుండే ప్రిపేర్ చేసేస్తున్నాడు అంటున్నారు. అందుకే సుజనా కేంద్రం తో చర్చలు జరుపుతున్నాం.... కేంద్రాన్ని ఒప్పించడానికి ట్రై చేస్తున్నాం అని సోది చెబుతున్నాడు. ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని చెబుతూనే మళ్ళీ ప్రత్యేక ప్యాకేజి ఇస్తారేమో వాటితోనే సరిపెట్టుకుందామంటాడు. రెవిన్యూ లోటు ని కేంద్రం భరిస్తుంది అంటాడు క్లారిటీ ఇవ్వడు. సుజనా మారిషస్ బ్యాంకు కు రుణాలు ఎగవేసి కేంద్రం తో లాలూచి పడి ఇలాంటి వల్లమాలిన కబుర్లు చెబుతూ కేంద్రానికి విధేయుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక అలాంటి సుజనా మాటలు ఎవరు నమ్ముతారు. ఏపీ ప్రజల భవిష్యత్తుని కేంద్రానికి తాకట్టు పెట్టడానికి సుజనా మాత్రం రెడీగా ఉన్నాడనేది టాక్. నాబార్డ్ నిధుల కోసం కూడా ట్రై చేస్తున్నామని చెబుతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్టో తెలీదుమరి.