Advertisementt

బాలయ్య గెటప్‌ బాగుందంట..!

Fri 02nd Sep 2016 09:55 PM
balakrishna,gautamiputra satakarni,balakrishna look in gautamiputra satakarni,balayya  బాలయ్య గెటప్‌ బాగుందంట..!
బాలయ్య గెటప్‌ బాగుందంట..!
Advertisement
Ads by CJ

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'. దర్శకుడు క్రిష్‌ వివాహం కారణంగా ఈ చిత్రంకు ఈ మధ్య చిన్నగ్యాప్‌ ఇచ్చారు. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ మరలా మొదలైంది. ఈ చిత్రం షూటింగ్‌ మధ్యప్రదేశ్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌కు సంబంధించిన షూటింగ్‌ వర్కింగ్‌ స్టిల్స్‌ కొన్ని ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. కాగా ఈచిత్రంలో గౌతమిపుత్ర శాతకర్ణి టైటిల్‌ లీడింగ్‌ రోల్‌ను బాలయ్య పోషిస్తుండగా, బాలయ్య తల్లి గౌతమి పాత్రను బాలీవుడ్‌ సీనియర్‌ నటి హేమమాలిని ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఇక బాలయ్య భార్యగా శ్రియ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 50శాతంకు పైగా షూటింగ్‌ పూర్తయింది. ఈ చిత్రాన్ని వీలున్నంత త్వరగా పూర్తి చేసి సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో విడుదలకు సిద్దం చేస్తున్నారు. మొత్తానికి ఈ షూటింగ్‌ వర్కింగ్‌స్టిల్స్‌లో బాలయ్య రాజఠీవితో, రాజుల కాలం నాటి కాస్ట్యూమ్స్‌లో అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. మొత్తానికి ఈ స్టిల్స్‌ను చూసిన వారు పౌరాణిక, జానపద, చారిత్రక నేపథ్య చిత్రాలకు బాలయ్యలో కనిపిస్తున్న డైనమిక్‌ హీరోయిజం ఈ తరంలో కేవలం బాలయ్యకు మాత్రమే బాగా సూట్‌ అవుతాయని అంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ