టాలీవుడ్ హీరోల్లో కొంతమంది సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నారు. వారిలో కొంతమందికి ఆ సిక్స్ ప్యాక్ సెట్ అవుతుంది. మరికొంత మందికి తేడా కొడుతోంది. అల్లు అర్జున్ వంటి వారికి సిక్స్ ప్యాక్ కర్రెక్టుగా సెట్ అయితే మహేష్ బాబు లాంటి వాళ్లకి సిక్స్ ప్యాక్ పెద్దగా అచ్చిరాలేదనే చెప్పాలి. ఇక ఇప్పుడు కొత్తగా కళ్యాణ్ రామ్ కూడా సిక్స్ ప్యాక్ ట్రై చేశాడు. కళ్యాణ్ రామ్ -పూరి కాంబినేషన్ లో 'ఇజం' చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు 12 సంవత్సరాలు కావొస్తుంది. ఇంతటి అతని కెరీర్ లో మొదటి సినిమా 'అతనొక్కడే'... మళ్ళీ ఆ మధ్య వచ్చిన 'పటాస్' తప్ప అతనికి హిట్ అనేదే లేదు. ఇక తాజాగా ఇప్పుడు పూరి డైరెక్షన్ లో 'ఇజం' లో చేస్తున్నాడు. మరి ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ కూడా ట్రై చేస్తున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అదే నిజం చేస్తూ కళ్యాణ్ రామ్.. తాను సిక్స్ ప్యాక్ ట్రై చేసిన బాడీతో వున్న ఫోటో ని తన తండ్రి హరికృష్ణ 60 వ పుట్టినరోజు కానుకగా విడుదల చేసాడు. ఈ సిక్స్ ప్యాక్ కోసం కళ్యాణ్ రామ్ చాలా కష్టపడ్డాడని ఈ పోస్టర్ చూస్తేనే తెలుస్తుంది. ఈ సినిమాలో కళ్యాణ్ ఓ జర్నలిస్ట్ గా నటిస్తున్నాడు. అన్యాయాలను ఎదుర్కునే జర్నలిస్టుగా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఇరగదీశాడని చెబుతున్నారు 'ఇజం' చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాకి యాక్షన్ సీన్స్ హైలెట్ గా వుంటాయని అంటున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా భారీ రిలీజ్‌కు రెడీ అవుతోంది.