ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత కొన్ని రోజులుగా భయం భయంగా కనపడుతున్నాడు. బాబును ఏదో భయం వేదిస్తున్నట్టుగా కనపడుతుంది చూడబోతే. బాబు ఏం చేశాడు..? బాబుకు భయం పట్టుకోవడం ఏంటంటే.. పవన్ కళ్యాన్ తెరమీదకు రావడం బాబుకు పెద్ద సవాల్ గా మారిందట. అందుకనే ఈ మధ్య బాబు సరిగ్గా నిద్రపోకుండా గడుపుతున్నాడని కూడా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ను బెదరకొట్టకుంటే ముందు ముందు సమస్యలెదురవుతాయన్నది ఒకవైపు, కేంద్రంతో తెగతెంపులు చేసుకుంటే రావాల్సిన నిధులు కూడా ఆగిపోతాయేమోనన్న భయం మరోపక్క వేధిస్తుంది చంద్రబాబును. ఈ రెండింటి మధ్యలో ప్రజల్లో తేడా రాకుండా కూడా కాపాడుకొనేందుకు ఇప్పటి పరిస్థితుల్లో రాజకీయ సమీకరణాలను చూసుకొంటే చంద్రబాబు పరిస్థితి ముందు గొయ్యి, వెనక నుయ్యి అన్న చందంగా తయారయ్యింది. ఏ స్టెప్ తీసుకోకుండా ఇప్పుడున్నట్లుగానే ఆంధ్ర పాలన చేస్తుంటే, అలాగే స్థిరంగా స్థిమితంగా కాని ఉంటే ప్రజల్లో దూరం పెరగ వచ్చునన్న అనుమానాల తాలూకూ భయం బాబును మరోపక్క వేధిస్తుంది. కాగా ఈ భయం మధ్యలో చంద్రబాబు అటు విజయవాడ- హైదరాబాద్, ఇటు రాయలసీమ- హైదరాబాద్ కు విచ్చలవిడిగా తిరుగుతున్న చప్పుళ్ళు ప్రజలకు వినిపిస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే దీంతో పాటు ఓటుకు నోటు కేసు తాలూకూ దర్యాప్తు కూడా మళ్ళీ వెలుగులోకి వచ్చేసరికి ఇక బాబుకు దిమ్మతిరిగి పోతుంది. అందుకనే హైకోర్టులో అప్పుడే ఓ పక్క కేసు నడుస్తుంటే మరో ఉప కేసు ఏంటి అన్నట్లు లాయర్ చేత కౌంటర్ దాఖలు చేయించుకున్నాడు కూడాను.
కాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుందామనుకుంటే ముందు ముందు కేంద్రంలో అధికార పార్టీతో పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాలో అన్న ఆలోచనతో కూడిన భయం కూడా బాబును ఆవరించింది. ఇలా పలు సమస్యలతో ఓ పక్క ప్రజల్లో తగ్గుతున్న ఇమేజ్ తో సతమతమవుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఇటువంటి చాలా సంక్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజల్లో మెప్పు పొందేందుకు బాబు ఎటువంటి స్టెప్ తీసుకోనున్నాడో వేచి చూడాలి. అప్పుడే మీడియాలో కూడా కేంద్రంతో స్నేహపూర్వకంగానే తెగదెంపులు చేసుకుందామన్న వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి. ఈ విభిన్నమైన ఆంధ్రరాష్ట్రంలో ఉన్న ఈ విపత్కర పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని సమయంలో కాస్త సేద తీర్చుకొనే నిమిత్తం సింగపూర్ వెళ్ళిరానున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చూద్దాం వచ్చాక ఏం చేస్తాడో మరి?