Advertisementt

బ్లాక్ బస్టర్ లేదు..భామ మాత్రం బిజీ బిజీ!

Thu 01st Sep 2016 09:30 PM
rakul preet singh,tamanna,dhruva,rakul in murugadoss movie,sai dharam tej,block buster movie  బ్లాక్ బస్టర్ లేదు..భామ మాత్రం బిజీ బిజీ!
బ్లాక్ బస్టర్ లేదు..భామ మాత్రం బిజీ బిజీ!
Advertisement
Ads by CJ

'హ్యాపీడేస్' సినిమా తర్వాత తమన్నా చాలా సినిమాల్లో నటించింది. అయితే కొన్ని యావరేజ్, హిట్ సినిమాల్లో నటించినా కూడా తమన్నాకి ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ హిట్ పడలేదు. మొన్నా మధ్య వచ్చిన బాహుబలి బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ అనుష్క... సో తమన్నా సెకండ్ హీరోయిన్ గానే వుంది. ఇక అలాగే తమన్నాకి వారసురాలిగా రకుల్ కూడా అదే విధం గా బాధపడుతుంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ గా చలామణి అవుతున్న కాజల్, సమంతలు ఏడాదికి ఒక్కో సినిమాలో మాత్రమే చేస్తున్నారు. కానీ రకుల్ మాత్రం ఒకప్పుడు తమన్నాలా  చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటూ వుంది. కానీ ఆమెకి సరైన బ్లాక్ బస్టర్ హిట్ పడడం లేదు. అయినా కూడా ఇప్పుడు యంగ్ హీరోస్ అందరితో రకుల్ సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ అయిపొయింది. తాజాగా రకుల్ మహేష్ - మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా చేస్తుండగా... మరోపక్క రామ్ చరణ్ ధ్రువ లో కూడా హీరోయిన్ గా చేస్తుంది. అలాగే ఈ పెద్ద సినిమాల్లో నటిస్తూనే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తుంది. హిట్ లేకపోయినా చేతినిండా సినిమాలు ఉంటే దానికన్నా అదృష్టం ఏం ఉంటుంది అంటున్నారు జనాలు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ