ఇంతకాలం కాపులకు ప్రతినిధిగా తన సారధ్యంలోనేే అన్ని జరిగేలా ప్లాన్ చేసుకుంటూ కాపులకు తానే నాయకుడిని అని భావిస్తున్న ముద్రగడ , పవన్‌కళ్యాణ్ కాపు రాజకీయాలు చేస్తే దెబ్బతినేది ముందుగా ఆయనే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కనుక కాపు రిజర్వేషన్లకు మద్దతు ప్రకటిస్తే తన స్ధానానికి ఎసరు ఖాయమని, అందుకే ఈలోపు పవన్‌ని తన ఇమేజ్‌కు భంగం వాటిల్లకుండా చేయడానికే ముద్రగడ అటు చిరంజీవిని, ఇటు దాసరిని ఇద్దరినీ లైన్‌లోకి తెచ్చి తన స్దానానికి ఎసరు రాకుండా చూసుకునే ప్రయత్నాలో ముద్రగడ ముందుచూపుతో వ్యవహరిస్తున్నారని సమాచారం. అయితే పవన్ వ్యక్తిత్వం గురించి బాగా తెలిసిన సన్నిహితులు మాత్రం పవన్ ఇటు కాపులకు రిజర్వేషన్ల విషయంలో మౌనంగా ఉంటాడే తప్ప కుల రాజకీయాలు చేసి తన బ్రాండ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసుకోడని, ఆయన కుల, మతాలకు అతీతంగా తన రాజకీయ ప్రభావాన్ని చూపించాలనుకుంటున్నాడని చెబుతున్నారు. మరి ఇంతకీ పవన్ కాకినాడ సభలో ఏం మాట్లాడుతాడు? కాపు రిజర్వేషన్లపై స్పందిస్తాడా? అనే విషయం ఇప్పుడు ముద్రగడకు నిద్ర పట్టని పరిస్దితి ఏర్పడింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.