సెప్టెంబర్ 9 నుండి మరలా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ రాజకీయాలతో, జిల్లాలలో మీటింగ్‌లతో బిజీ కానున్నారు. దాంతో ఆయన చేయాల్సిన డాలీ చిత్రం షూటింగ్ సస్పెన్స్‌లో పడిపోయిందనే వార్తలు వస్తున్నాయి. కాగా ఇటు సినిమాలు, అటు రాజకీయాల మధ్య ఇబ్బంది రాకుండా ఉండేందుకు పవన్ తాజాగా దర్శకుడు డాలీకి ట్విస్ట్ ఇచ్చాడని సమాచారం. పవన్ ఏ సినిమా చేయాలనుకున్నప్పటికీ కేవలం తన డేట్స్ ను 50రోజులు మాత్రమే ఇవ్వాలని ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఈ 50 రోజులలోపే తను నటించాల్సిన సినిమాలకు కేటాయించనున్నాడని సమాచారం. మిగిలిన సమయంలో పవన్ రాజకీయాలతో బిజీ కానున్నాడు. అంటే పవన్‌తో సినిమాలు తీయాలని ఆశపడుతున్న దర్శకనిర్మాతలు కేవలం 50రోజుల్లో తనకు సంబంధించిన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేయాల్సివుంటుంది. ఈ విధంగా చేయడం ద్వారా పవన్ ఇటు సినిమాలకు, అటు రాజకీయాలకు పూర్తిస్దాయిలో న్యాయం చేయగలుగుతాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. కాగా టార్గెట్ 50 అనే నిబంధన డాలీ చిత్రం నుండే ప్రారంభం కానుంది. మరి పవన్ వేసిన ఈ ప్లాన్ ఆయనకు వర్కౌట్ అవుతుందో లేదో చూడాల్సివుంది.