Advertisementt

ఎన్టీఆర్ అభిమానులు అస్సలు మారలేదు!

Thu 01st Sep 2016 01:15 PM
janatha garage,jr ntr,fans,benefit show tickets,record price to janatha garage benefit show tickets  ఎన్టీఆర్ అభిమానులు అస్సలు మారలేదు!
ఎన్టీఆర్ అభిమానులు అస్సలు మారలేదు!
Advertisement
Ads by CJ

'జనతా గ్యారేజ్' సినిమా విడుదలకు ఎంతో సమయం లేదు. ఈ సినిమా ను తీసిన దర్శకుడు.... నటించిన హీరో ఎన్టీఆర్ వరుస హిట్స్ తో మంచి జోరుమీదున్నారు. ఇంకా ఈ చిత్రం కూడా హిట్ అవుతుందనే కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎక్కడా చూసినా 'జనతా గ్యారేజ్' రిలీజ్ గురుంచే మాట్లాడుకుంటున్నారు జనాలు. అంత క్రేజీ కాంబినేషలో తెరకెక్కిన ఈ 'జనతా గ్యారేజ్' చిత్రానికి సంబంధించి ఒక వార్త ఇండస్ట్రీ లో చక్కెర్లు కొడుతోంది. అదేమిటంటే 'జనతా గ్యారేజ్' బెన్ఫిట్ షో మొదటి మూడు టికెట్స్ రికార్డు స్థాయిలో భారీ రేటుకు కొనుగోలు చేశారని సమాచారం. ఆగష్టు 31  తెల్లవారుజామున 4 గంటలకు వెయ్యబోయే 'జనతా గ్యారేజ్' బెన్ఫిట్ షో టికెట్స్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎగబడుతున్నారట. అయితే ఈ షో కి సంబంధించి టికెట్స్ ని తెలుగుదేశం యువ నేతలు కొంతమంది చెన్నై లో ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీ లో వేలానికి పెట్టగా రికార్డు స్థాయిలో మొదటి టికెట్ 31000 కి అమ్ముడు పోగా... రెండో టికెట్ ధర 17500 పలికిందని.... అలాగే మూడో టికెట్ ధర కూడా 13000 లకు అభిమానులు సొంత చేసుకున్నారని సమాచారం. మరి అభిమానులంటే అంతే... తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఇలా దేన్నీ లెక్క చెయ్యకుండా రెచ్చిపోతారు. మరి ఎన్టీఆర్ మాత్రం ముందు దేశాన్ని, తర్వాత తల్లి తండ్రులను ప్రేమించమంటున్నాడు. మరి ఎన్టీఆర్ చెప్పిన ఈ సూక్తులను అభిమానులు ఎంతమంది తలకెక్కించుకున్నారో తెలీదు గాని ఇప్పుడు ఈ టికెట్స్ ధరలు చూస్తే మాత్రం అభిమానులు ఏమాత్రం మారలేదని చెప్పాలి. ఇక ఈ టికెట్స్ ధరలు చూస్తుంటే 'జనతా గ్యారేజ్' మీద వున్న అంచనాలు ఇంకా పెరిగిపోయాయనే చెప్పాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ