Advertisementt

సుజనా.. స్పెషల్ స్టేటస్ ఇచ్చేశాడు!

Thu 01st Sep 2016 01:10 PM
sujana chowdary,andhra pradesh,special status,bjp  సుజనా.. స్పెషల్ స్టేటస్ ఇచ్చేశాడు!
సుజనా.. స్పెషల్ స్టేటస్ ఇచ్చేశాడు!
Advertisement
Ads by CJ

మరో వారం రోజుల్లో ప్రత్యేక హోదా ప్రకటన వెలువడుతుంది.... ఇది చెప్పింది ఎవరో కాదు కేంద్ర కేబినెట్ లో మంత్రి పదవి వేలెగబెడుతున్న సుజానా చౌదరి. ఆయన తన స్వార్ధ ప్రయోజనాల కోసం కేంద్రాన్ని సమర్ధిస్తున్నారనే విమర్శలు వున్నాయి. ఈయన ప్రత్యేక హోదా విషయం లో కేంద్రం తో లాలూచి పడి తన పనులను చేసుకుంటున్నాడని అందరూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక ఇలాంటి సమయం లో ప్రత్యేక హోదా ప్రకటన మరో వారం రోజుల్లో వెలువడుతుందని.... దీనిపై వెంకయ్య  నాయుడితో, అరుణ్ జైట్లీ తో చర్చించామని చెబుతున్నారు. మరి చర్చించిన  మాట నిజమే గాని హోదా పై కేంద్రం ఏం ప్రకటన చేస్తుంది.... అసలు హోదా ఇవ్వడానికి కేంద్రం సుముఖంగా లేనప్పుడు ఎలా హోదా విషయం లో ప్రకటన చేస్తుంది అనేది కోటి బిలియన్ డాలర్ల ప్రశ్న. కేంద్రంతో సన్నిహితంగా  ఉండి.... కేంద్ర మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని  తనపై వున్న ఆరోపణలను పైకి రానివ్వకుండా సుజనా  జాగ్రత్తపడుతున్నాడనేది అందరికి తెలిసిన విషయమే. ఆ మధ్య మారిషస్ బ్యాంకు రుణాల ఎగవేత కేసులో కోర్టు హాజరైన సుజనా  ఆ కేసు విషయమై కేంద్రం నుండి సహాయం పొంది వారికి విధేయుడిగా మారిపోయాడని అంటున్నారు. ఫలితంగా ఆ కేసు మరుగున పడిపోయింది అని కూడా ప్రచారం జరుగుతుంది. అలాగే తన ప్రయోజనాల కోసం సుజనా ఏపీ అభివృద్ధిని కేంద్రానికి తాకట్టు పెడుతున్నారని విమర్శిస్తున్నారు. ఇంకా తిరుపతి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మా ఏపీ ఎంపీలంతా చాలా డబ్బు, పలుకుబడి ఉన్నవాళ్ళని డైరెక్టుగా విమర్శించిన సంగతి తెలిసిందే. మరి సుజనా మాత్రం పవన్ వ్యాఖ్యలకు ఎటువంటి కౌంటర్ ఇవ్వలేదు సరికదా అసలు ఆ సభ గురుంచి ఎటువంటి కామెంట్స్ చెయ్యలేదు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ