జనతా గ్యారేజ్ సినిమా విడుదల విషయంలో పలు సెంటిమెంట్లు పట్టి పీడిస్తున్నాయి. జనతా గ్యారేజ్ సినిమా విడుదల తేదీ ఏ ముహూర్తాన ప్రకటించారో గానీ అప్పటి నుండి ముమ్మరంగా వార్తల్లోకి ఎక్కుతుంది. జనతా గ్యారేజ్ విడుదల తేదీ అయిన సెప్టెంబర్ 1 అమావాస్య. సూర్య గ్రహణం కూడాను. ఎంతో శ్రమకోర్చి, ఇబ్బందులు పడి చిత్రీకరించిన సినిమాని ఖచ్చితంగా సెప్టెంబర్ 1 వతేదీ అమావాస్య రోజునే సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సర్వం సిద్ధం చేశారు. ఇదే ఈ సినిమా కి పెద్ద వీక్ పాయింట్ గా చెబుతున్నారు
కాగా యంగ్ టైగర్ ఎన్టీయార్- కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా జనతా గ్యారేజ్. ఇది కొరటాల దర్శకత్వం వహిస్తున్న మూడవ సినిమా కూడాను. అన్ని సెంటిమెంట్ల ఈ సినిమాకు ఇలా కుదురుకుంటున్నాయి. ఒకసారి టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ తీసిన 3వ సినిమా జాబితా తాలూకూ విజయాలను పట్టి చూస్తే.. కొరటాల దర్శకత్వం వహించిన 3వ సినిమా అయిన జనతా గ్యారేజ్ కి ఎలాంటి డోకా ఉండదని ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పక తప్పదు.
టాలీవుడ్ లో ఎస్ ఎస్ రాజమౌళి- 3 వ చిత్రంగా వచ్చిన ‘సై’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే వి.వి వినాయక్ దర్శకత్వం వహించిన 3వ సినిమా దిల్ కూడా మంచి ఫలితాన్ని అందుకుంది. త్రివిక్రమ్ మూడవ సినిమా జల్సా హిట్ సాధించింది. కాగా బోయపాటి శ్రీను 3వ సినిమాగా చేసిన సింహా బాక్సీఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇకపోతే సుకుమార్-దర్శకత్వం వహించిన 3వ చిత్రం ఆర్య-2. ఇది బాక్సీఫీసు వద్ద ఫట్ మన్నది. పూరి జగన్నాద్ ‘ఇట్లు శ్రావణి శుబ్రహ్మణ్యం’ 3వ చిత్రంగా మంచి హిట్ అందుకుంది. శ్రీను వైట్ల 3వ చిత్రం సొంతం. మంచి సినిమాగా పేరందుకుంది.
ఇంకా గుణశేఖర్ 3 చిత్రంగా దర్శకత్వం వహించిన ‘రామాయణం’ మంచి విజయాన్ని అందుకొని గుణశేఖర్ గొప్ప దర్శకుడు కావడానికి రాజబాట వేసింది. అసలు శేఖర్ కమ్ముల 3వ చిత్రమైన ‘హ్యాపీడేస్’ అప్పట్లో మంచి సంచలనం సృష్టించి గొప్ప విజయాన్ని అందుకుంది. కాగా క్రిష్ జాగర్లమూడి- 3 వచిత్రంగా ‘కృష్ణం వందే జగద్గురుం’ మంచి చిత్రంగా రాణించింది. ఇక కొరటాలకు ఇప్పుడు 3 వ చిత్రం సింటిమెంట్ ఎదుర్కొంటున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘జనతా గ్యారేజ్’ సినిమా ఆయన 3 వ చిత్రం. ఇది ఎలాంటి ఫలితాన్నిస్తుందోనని అందరు అత్యంత ఆతృతతో ఎదురు చూస్తున్నారు. కొరటాల మూడవ చిత్రమైన 'జనతా గ్యారేజ్' మంచి విజయాన్ని అందించి టాప్ డైరెక్టర్స్ అందుకున్న ఘనకీర్తులనే అందించి పెడుతుందా? లేదా? అన్న విషయం ఇప్పుడు అందరి మనస్సులను తొలుస్తుంది. అలా జనతా గ్యారేజ్ చుట్టూతా సెంటిమెంట్లు అల్లుకొని ఉన్నాయి. కాగా సెప్టెంబర్ 1వ తేదీ జనతా గ్యారేజ్ విడుదలై మంచి విజయాన్ని అందుకొని అన్ని సెంటిమెంట్లను పటా పంచలు చేయాలని ఆకాంక్షిద్దాం.