Advertisementt

మురుగదాస్‌ హ్యాట్రిక్‌ కొడతాడా..?

Wed 31st Aug 2016 03:47 PM
ar murugadoss,akira movie,mahesh babu,hat trick  మురుగదాస్‌ హ్యాట్రిక్‌ కొడతాడా..?
మురుగదాస్‌ హ్యాట్రిక్‌ కొడతాడా..?
Advertisement
Ads by CJ

సౌతిండియాతో పాటు బాలీవుడ్‌లో కూడా 'గజిని, హాలీడే' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మురుగదాస్‌. కాగా ప్రస్తుతం ఈయన మహేష్‌బాబుతో తెలుగు, తమిళ భాషల్లో ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇక ఇదే సమయంలో మురుగదాస్‌ బాలీవుడ్‌లో సోనాక్షిసిన్హా ప్రధాన పాత్రలో 'అకీరా' అనే చిత్రాన్ని తీస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌కశ్యప్‌తో కలిసి మురుగదాస్‌ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, ఆడియో పెద్ద హిట్‌ అయ్యాయి. పోస్టర్స్‌ కూడా ఈ చిత్రంపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక ఈ చిత్రం యూనిట్‌ ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో మురుగదాస్‌ కూడా జాయిన్‌ అయ్యాడు. ఈ శుక్రవారం అంటే సెప్టెంబర్‌ 2న ఈ చిత్రం దేశవ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతోంది. మరి ఈ చిత్రంతో మురుగదాస్‌ హ్యాట్రిక్‌ కొడితే మహేష్‌ సినిమాకు కూడా అది పెద్ద ప్లస్‌ పాయింట్‌ అవుతుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ