Advertisementt

పవన్ 'కడప కింగ్' కాదంట..!

Wed 31st Aug 2016 03:35 PM
pawan kalyan,kadapa king,katam rayudaa,power movie,dolly  పవన్ 'కడప కింగ్' కాదంట..!
పవన్ 'కడప కింగ్' కాదంట..!
Advertisement
Ads by CJ

నిన్న గాక మొన్న తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి నేను రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తానని కుండబద్దలు కొట్టాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నా దగ్గర డబ్బు లేదు.. అందుకే నేను సినిమాలు చేస్తున్నాను అని చెప్పాడు. మీరు టికెట్స్ కొంటేనే నాకు డబ్బులు వస్తాయని చమత్కరించాడు. అంటే పవన్ ఇక రాజకీయాల పరంగాను, సినిమాల పరంగాను బాగా బిజీ అవుతాడనేగా దానర్థం. శరత్ మరార్ నిర్మాణ సారధ్యం లో డాలీ డైరెక్షన్ లో పవన్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ మొదలయ్యాక ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా తనకి సంబందించిన సీన్స్ అన్ని 50 రోజుల్లో కంప్లీట్ చెయ్యాలని పవన్ కంకణం కట్టుకున్నాడట. అయితే ఈ సినిమాకి టైటిల్ కూడా సెట్ అయిపొయింది అని అన్నారు. ఆ టైటిల్ 'కడప కింగ్' అని ప్రచారం కూడా జరిగింది. కానీ టైటిల్ విషయం లో ఈ చిత్ర యూనిట్ మరలా ఆలోచనలో పడినట్టు సమాచారం. 'కడప కింగ్' అనే టైటిల్ కంటే 'కాటమ రాయుడా' అన్న టైటిల్ అభిమానులకు తొందరగా కనెక్ట్ అవుతుందని అందుకే దీనిని పరిశీలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక ఈ సినిమాకి 'కాటమ రాయుడా' అన్న టైటిలే ఫైనల్ అవుతుందని అంటున్నారు. మరి పవన్ ఈ టైటిలే ని ఒకే చేస్తాడా లేక మరేదైనా ఆలోచిస్తాడా చూద్దాం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ