యంగ్ టైగర్ ఎన్టీయార్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాకు సెన్సార్ బోర్డు కష్టాలు చుట్టుముట్టాయి. కొరటాల దర్శకత్వం వహించిన జనతా గ్యారేజ్ సినిమా సెప్టెంబర్ 1 వ తేదీ విడుదల అవ్వాల్సి ఉంది. కానీ తీరా సెన్సార్ బోర్డు సభ్యులు జనతా గ్యారేజ్ సినిమా చూసి ఈ సినిమా యు/ఎ సర్ఠిఫికెట్ పొందేందుకు కొన్ని ఆంక్షలు విధించింది. సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించాలని, అలా చేస్తేనే యు/ఎ సర్ఠిఫికెట్ ఇస్తామని సెన్సార్ బోర్డు విధించిన ఆంక్షలకు చిత్ర యూనిట్ రీషూట్ చేసేందుకు సమాయత్తమైంది. అయితే ఇప్పటి వరకు సెన్సార్ సర్టిఫికెట్ చిత్ర యూనిట్ కి లభించలేదని ఫిలిం నగర్ వర్గాల ద్వారా తెలుస్తుంది. రిలీజ్ కొన్ని గంటల సమయంలో ఇటువంటి టెంక్షన్ జనతా గ్యారేజ్ పై నెలకొన్న నేపథ్యంలో సినిమా అనుకున్న డేట్ కు విడుదల అవుతుందా? లేదా? అన్న టెంక్షన్ లో చిత్ర యూనిట్ విపరీతమైన మానసిక వత్తిడికి గురౌతున్నట్లు తెలుస్తుంది.
ఇటువంటి పరిస్థితుల్లో సినిమా రీషూట్, డబ్బింగ్ తదితర కార్యక్రమాలు పూర్తి చేసుకొని యూ/ఎ సర్ఠిపికెట్ పొంది అనుకున్న టైం కి సినిమా రిలేజ్ చేస్తామా? లేదా? అన్న టెంక్షన్ లో చిత్ర యూనిట్ వున్నట్లుగా టాక్. ఒక రకంగా జనతా గ్యారేజ్ సినిమా విడుదల విషయంలో నటీనటులు, చిత్ర నిర్మాతలు, దర్శకుడు కూడా చాలా తీవ్రమైన వత్తిడికి గురౌతున్నట్లు తెలుస్తుంది. విడుదల టైమ్ అతి తక్కువ ఉండటం, బాక్స్ లు డిస్పాచ్ అవ్వాల్సిన టైమ్ లో.. సెన్సార్ సర్టిఫికెట్ కోసం చిత్ర యూనిట్ పడిగాపులు కాస్తుండటం.. ఎన్టీఆర్ అభిమానులకు సైతం టెన్షన్ పెట్టిస్తుంది.